Top Ad unit 728 × 90

అర్జెంటీనాను ఓడించిన సౌదీ అరేబియా

ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం. అర్జెంటీనాను ఓడించిన సౌదీ అరేబియా

 

తార్ లో ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్‌లో ఇవ్వాల సంచలనాత్మక రికార్డు నెలకొంది. నెంబర్-3 జట్టు అర్జెంటీనాను ఆసియా పసికూన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది.

 

అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన అర్జెంటీనా జైత్రయాత్రకు ఈ మ్యాచ్ తో సౌదీ అడ్డుకట్ట వేసినట్టు అయ్యింది. తనకన్నా ఎన్నో రెట్లు బలమైన అర్జెంటీనాను సౌదీ అరేబియా 2-1 తేడాతో చిత్తుగా ఓడించింది.

 

ప్రత్యర్థి జట్టులో లయొనెల్ మెస్సీ వంటి దిగ్గజ స్ట్రయికర్ ఉన్నప్పటికీ సౌదీ ఆటగాళ్లు వెనక్కి తగ్గకుండా తమ శక్తికి మించిన ప్రదర్శన చేశారు. ఇవ్వాల జరిగిన గ్రూప్-సి మ్యాచ్ లో తొలి గోల్ అర్జెంటీనానే చేసింది. మ్యాచ్ 10వ నిమిషంలో మెస్సీ చేసిన గోల్ తో అర్జెంటీనా జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, 48వ నిమిషంలో సలేహ్ అల్ షెహ్రీ చేసిన గోల్ లో సౌదీ 1-1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలకే సలేమ్ అల్ దవ్సారీ చేసిన గోల్ తో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక... స్కోరును సమం చేసేందుకు అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్రంగా యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్జెంటీనా ఫార్వర్డ్ ల దాడులను సౌదీ అరేబియా గోల్ కీపర్, డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. దీంతో మెస్సీ సేనకు భంగపాటు తప్పలేదు.

 

అర్జెంటీనాను ఓడించిన సౌదీ అరేబియా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *