Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

గబ్బరే నెంబర్ వన్ ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ కొత్త రికార్డ్...!

గబ్బరే నెంబర్ వన్ ఐపీఎల్లో శిఖర్ ధావన్ కొత్త రికార్డ్...!

 

ధావన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్గా ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు 167 మ్యాచ్ల్లో 166 ఇనింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ 39 అర్ధ సెంచరీలు చేశాడు. ఐతే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. 134 ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ ఏకంగా 46 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ వార్నరే టాప్లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. భారత బ్యాట్స్మెన్లో మాత్రం శిఖర్ ధావనే టాప్లో ఉన్నాడు. గబ్బర్ తర్వాతి స్థానాల్లో విరాట్ కొహ్లీ, సురేష్ రైనా, రోహత్ శర్మ, గౌతం గంభీర్ ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక అర్ద సెంచరీలు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో కొహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ 184 మ్యాచ్ల్లో 176 ఇన్నింగ్స్ ఆడి 38 అర్ధ సెంచరీలు కొట్టాడు. ప్రస్తుత టోర్నీకి దూరంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 193 మ్యాచ్ల్లో 189 ఇన్నింగ్స్ ఆడిన రైనా 38 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 195 మ్యాచ్ల్లో 190 ఇన్నింగ్ ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ కూడా 38 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

గబ్బరే నెంబర్ వన్ ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ కొత్త రికార్డ్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *