టి 20 సిరీస్ షెడ్యూల్…!
టి 20 సిరీస్ షెడ్యూల్…!
ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా మరో మెగా సిరీస్ కోసం సిద్ధమవుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు కోసం భారత జట్టు ఆడనుంది. ఈ సిరీస్‌లో 4 టెస్టులు, 5 టి 20 లతో పాటు 3 వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. ఫిబ్రవరి 5 నుండి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టెస్ట్ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగునున్నాయి. చాలా రోజుల తర్వాత ప్రత్యేక్షంగా మ్యాచ్‌ని వీక్షిద్దాం అనుకున్న అభిమానులను కొంత నిరాశపరిచే విషయమే. బిసిసిఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం 'భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే టి 20 సిరీస్‌కు 50 శాతం మంది ప్రేక్షకులను బోర్డు అనుమతించేందుకు సిద్దంగా ఉంది. కానీ ప్రభుత్వం తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు 'అని బిసిసిఐ ఆధికారి ఒకరు తెలిపారు.
మొదటి టెస్ట్ ఫిబ్రవరి 5 నుండి చెన్నై వేదికగా భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. అదే స్టేడియంలో 2 వ టెస్ట్ ఫిబ్రవరి 13 నుండి 17 వరకు జరుగుతుంది. మూడవ టెస్ట్ ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అహ్మదాబాద్ అతిథ్యం ఇవ్వనుంది. చివరి టెస్ట్ మార్చి 4 నుండి 8 వరకు జరుగుతుంది. ఇక అహ్మదాబాద్‌లోనే ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్, పూణేలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉంటుంది.ఫిబ్రవరి 5 నుంచి ఈ సిరీస్ మెుదలుకానుంది. ఇక సిరీస్ పూర్తి షెడ్యూల్‌ను ఓ సారి చూస్తే…
4 టెస్ట్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 5 - మార్చి 8
మెుదటి టెస్టు: ఫిబ్రవరి 5-9, వేదిక: చెన్నై మ్యాచ్ సమయం: ఉదయం 9:30 నిమిషాలు
రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, వేదిక: చెన్నై మ్యాచ్ సమయం: ఉదయం 9.30 ని II
మూడో టెస్టు: ఫిబ్రవరి 24-28, వేదిక: అహ్మదాబాద్ సమయం: మధ్యాహ్నం 2.30 ని (డే/నైట్) IIనాలుగో టెస్టు: మార్చి 4-8, వేదిక: అహ్మదాబాద్ సమయం: ఉదయం 9.30 నిమిషాలు
ఐదు టీ20 మ్యాచ్‌లు
భారత్- ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ మొతేరా స్టేడియం వేదికగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్నాయి.
మ్యాచ్ సమయం: రాత్రి 7 గంటల
తొలి టీ20: మార్చి 12
రెండో టీ20: మార్చి 14
మూడో టీ20: మార్చి 16
నాలుగో టీ20: మార్చి 18
ఐదో టీ20: మార్చి 20
మూడు వన్డేలు
మూడు వన్డేల సిరీస్‌కు పుణె వేదిక జరగనుంది
సమయం: మధ్యాహ్నం 1.30 ని II
తొలి వన్డే: మార్చి 23
రెండో వన్డే: మార్చి 26
మూడో వన్డే: మార్చి 28
