Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కార్తీక్ రాజీనామా వెనుక అసలు కారణమిదే...!

కార్తీక్ రాజీనామా వెనుక అసలు కారణమిదే...!

 

ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలో కోల్కతా నైట్ రైడర్స్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ముంబైతో మ్యాచ్కు కొద్ది గంటల ముందు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతలను చేపట్టాడు. బ్యాటింగ్పై ఫోకస్ పెట్టడం కోసం తాను కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు కార్తీక్ చెప్పుకొచ్చాడు. కానీ అసలు నిజం అది కాదని కోల్కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడుకోల్కతా నైట్ రైడర్స్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచిన గంభీర్ సీజన్ మధ్యలో కెప్టెన్ మారడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నాడు. క్రికెట్ అనేది రిలేషన్షిప్స్కు సంబంధించిన అంశం కాదు. నిజాయతీగా చెప్పాలంటే ఆటతీరుకు సంబంధించింది. మోర్గాన్ కెప్టెన్ కావడం వల్ల పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. లీగ్ ప్రారంభంలోనే మోర్గాన్ను కెప్టెన్గా నియమించి ఉంటే అతడు ఎన్నో మార్పులు చేయడానికి అవకాశం ఉండేది. కానీ సీజన్ మధ్యలో ఎవరేం మార్చలేరు. కోచ్, కెప్టెన్ మధ్య సత్సంబంధాలు ఉండటం మంచిది’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్తో తెలిపాడు. గత రెండేళ్లకుపైగా కార్తీక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సీజన్ మధ్యలో కెప్టెన్ను మార్చేంత చెత్తగా కోల్కతా ప్రదర్శనేం లేదు. అందుకే కెప్టెన్సీ మార్పు గురించి తెలియగానే ఆశ్చర్యపోయానని గంభీర్ తెలిపాడు. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ జట్టులో ఉన్నాడని పదే పదే మాట్లాడి దినేశ్ కార్తీక్పై ఒత్తిడి పెంచే బదులు ముందుగానే మోర్గాన్కు కెప్టెన్సీ అప్పగించాల్సిందని గంభీర్ వ్యాఖ్యానించాడు.

కార్తీక్ రాజీనామా వెనుక అసలు కారణమిదే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *