Top Ad unit 728 × 90

రెండో టెస్టులో ఎవరుంటారో చెప్పిన కోచ్‌…!

రెండో టెస్టులో ఎవరుంటారో చెప్పిన కోచ్‌…!

 

న్యూజిలాండ్‌తో తలపడే రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌ పృథ్వీషా ఆడుతున్నట్లు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి శుక్రవారం స్పష్టంచేశాడు. రెండో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. రెండో టెస్టుకు ముందు పృథ్వీ ఎడమకాలికి గాయమైన సంగతి తెలిసిందే. గురువారం అతడు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనకపోవడంతో రెండో టెస్టులో అతడికి బదులు శుభ్‌మన్‌గిల్‌ను ఆడించే అవకాశముందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పృథ్వీ కోలుకున్నాడని, రెండో టెస్టులో ఓపెనింగ్‌ చేస్తాడని శాస్త్రి పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ స్థానంలో తొలి టెస్టులో బరిలోకి దిగిన యువ బ్యాట్స్‌మన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలుత సౌథీ బౌలింగ్‌లో 16 పరుగులకే ఔటైన పృథ్వీ రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగుల వద్ద ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

 

మరోవైపు స్పిన్నర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారనే విషయంపై శాస్త్రి స్పష్టతనివ్వలేదు. ఈ విషయంలో మ్యాచ్‌కు ముందే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. తొలి టెస్టులో మూడు వికెట్లే తీసిన అశ్విన్‌ అటు బ్యాటింగ్‌లోనూ రాణించలేదు. ఈ సందర్భంగా అశ్విన్‌ గురించి మాట్లాడుతూ… అతడో ప్రపంచస్థాయి బౌలరని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు. పరిస్థితులను బట్టి సరైన జట్టుని ఎంపిక చేయాల్సి ఉంటుందని శాస్త్రి అన్నాడు. కొన్నేళ్లుగా ఉత్తమంగా బౌలింగ్‌ చేస్తున్న అశ్విన్‌ ఏదైనా విషయంలో ఇబ్బంది పడితే, అది బ్యాటింగ్‌ అయిండొచ్చని చెప్పాడు. దాన్ని కూడా అధిగమిస్తాడని కోచ్‌ పేర్కొన్నాడు.

 

ఇక టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమిని చవిచూడటంపై స్పందించిన ఆయన అప్పుడప్పుడు ఇలాంటి ఓటములు అవసరమని చెప్పాడు. ఈ ఓటమి టీమ్‌ఇండియా ఆటగాళ్లకు గుణపాఠమన్నాడు. ఇలాంటి ఓటములు.. తమ తప్పులు తెలుసుకొని మరింత బాగా ఆడేందుకు దోహదం చేస్తాయన్నాడు. ఎప్పుడూ గెలుస్తూ ఉంటే ఆటగాళ్ల ఆలోచనా పరిధి కూడా అక్కడే ఆగిపోంతుదని చెప్పాడు. వెల్లింగ్టన్‌ ఓటమిపై తాము సాకులు చెప్పట్లేదని, తమ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారని కోచ్‌ అంగీకరించాడు. అలాగే టెస్టు క్రికెట్‌ను వన్డేలతో పోల్చడం సరికాదని, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ పిచ్‌లు ఒకేలా ఉంటాయన్నాడు. రెండో టెస్టుకు టీమ్‌ఇండియా సిద్ధంగా ఉందని, అలాగే బుమ్రా, షమి బౌలింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. క్రైస్ట్‌చర్చ్‌లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తారని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు.

 

రెండో టెస్టులో ఎవరుంటారో చెప్పిన కోచ్‌…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *