Top Ad unit 728 × 90

బంగ్లాదేశ్‌ అవుట్‌! స్టేడియంలోనే ఏడ్చేసిన బుడ్డోడు..

బంగ్లాదేశ్‌ అవుట్‌! స్టేడియంలోనే ఏడ్చేసిన బుడ్డోడు..

ఆసియాకప్‌-2022 టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ నిష్క్రమించింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్‌-4కు అర్హత సాధించిగా. బంగ్లాదేశ్‌ మాత్రం ఇంటిముఖం పట్టింది. కాగా మ్యాచ్‌లో బం‍గ్లాదేశ్‌ తమ స్వీయ తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో బం‍గ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ముఖ్యంగా స్టేడియంలో ‍ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓ బుడ్డోడు అయితే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. బంగ్లాదేశ్‌ ఓటమి పాలైన అనంతరం బంగ్లా జెర్సీ ధరించి ఉన్న ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు.

పక్కన అతడి తల్లి ఓదారుస్తూ కనిపించింది. తమ జట్టు గెలుపు ఖాయమనుకున్న ఆ యువ ఆభిమాని.. తమ జట్టు ఆఖరికి ఓడిపోవడంతో. తట్టుకోలేకపోయాడు. కాగా గతంలో కూడా బంగ్లా జట్టు ఓటమి పాలైతే అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి.

 

బంగ్లాదేశ్‌ అవుట్‌! స్టేడియంలోనే ఏడ్చేసిన బుడ్డోడు.. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *