Top Ad unit 728 × 90

దత్త పురాణ అంతర్గత స్త్రోత్రం...!

దత్త పురాణ అంతర్గత స్త్రోత్రం...!

 

  • సూతునికి దత్త సాక్షాత్కరం

 

1. ప్రాణానాయమ్య మనసా!ధ్యాన స్తిమిత లోచన!

దేవదేవం మహాత్మానాం! యథాశ్రుతమచింతయత్॥

 

భావము: ప్రాణవాయువు బిగబట్టి, కనులు మూసుకుని, ఆ దేవదేవుడిని హృదయము నందు నిలిపి శాస్త్రీయంగా చింతించుచూ ధ్యానించుండెను.

 

2. ధ్యాయతః స్వపదాంభోజం!యోగి వంద్య పదాంబుజః!

ప్రాదురాసీద్ధృదంభోజే! దత్తాత్రేయస్త్రిమూర్తి ధృక్ ॥

 

భావము: యోగులచే నమస్కరింపబడే పాదపద్మాలు కలిగిన దత్తాత్రేయుడు, తన పాదపద్మములను ధ్యానించుచున్న సూతుని హృదయపద్మమున త్రిమూర్తిధారిగా సాక్షాత్కరించెను.

 

3. ప్రఫుల్ల వదనాంభోజః!కరుణార్ద్రహృదంబుజః!

విద్యుత్పింగజటాభారః! చంద్ర సూర్యాగ్ని లోచనః ॥

 

భావము: చిరునవ్వుతో  వికసించిన ముఖ పద్మము కలవాడై, దయతో తడిసిన హృదయము కలవాడై, మెరుపు తీగల వలె జడలు కలిగినవాడై,చంద్ర సూర్యాగ్నులు నేత్రములుగా కలవాడైన దత్తుడు కనపడెను.

 

4. దివ్య పీతాంబర ధరః! షడ్భుజైరుపలక్షితః!

స్వపాద నఖ చంద్రాంశు!ధ్వంసితా జ్ఞానకశ్మలః॥

 

భావము: దివ్యమైన పట్టువస్త్రములు ధరించి ఆరు భుజములతో ప్రకాశించుచూ, చల్లని చంద్రకిరణముల వంటి కాలిగోళ్ళ నుంచి వచ్చు కిరణములతో అజ్ఞానమును నాశనము చేయు దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యెను.

 

5. వరదోస్మీత్యువాచైనం!సూనృతా మంద్ర యాగిరా!

సూతః ప్రసన్న వదనో!హృషితాంగరుహైర్బభౌ ॥

 

భావము: నీకు వరము ఇచ్చుటకు వచ్చితిని అని శుభముగా మంద్రస్వరము తో స్వామి పలికెను. స్వామిని చూడగానే సూతునకు ఆనందము కలగగా పులకించిన ముఖము కలవాడై ప్రకాశించెను.

ఇట్లు సూతుడు దత్త సాక్షాత్కరముతో పరమానందమును పొందెను. అప్పుడు దత్తాత్రేయుడు సూతునితో నీవు చేసిన స్తోత్రం చదివిన వారికి మనస్సు లోని కోరికలు సిద్ధించి, పాపమనే కవచము వదిలి, చివరికి దివ్యమైన దత్తలోకమును పొందెదరు అని ఆశీర్వదించెను.

 

సరళతరం: రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి గారు

దత్త పురాణ అంతర్గత స్త్రోత్రం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *