Top Ad unit 728 × 90

ఏపీ ఉద్యోగుల పరిస్థితి... పగ వాడికి కూడా రాకూడదు!

ఏపీ ఉద్యోగుల పరిస్థితి... పగ వాడికి కూడా రాకూడదు!

 

అక్కడ డీఏలు ఇస్తే, ఇక్కడ నోటీసులు ఇస్తున్నారు. అక్కడ బకాయిలు చెల్లిస్తే.. ఇక్కడ బకాయిపడుతున్నారు. అక్కడ పోరాడి సాధించుకుంటే...

 

ఇక్కడ నోరెత్తడానికి భయపడుతున్నారు. ఇక నుంచి పోరాడితే ఉనికే ఉండదు. ఉద్యోగ సంఘమూ ఉండదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే గమ్మునుండాలి. ఇదీ ఏపీ ఉద్యోగుల పరిస్థితి.

 

ఏపీ ఉద్యోగుల పరిస్థితి దేశంలో మరెక్కడా ఉండదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు పరిస్థితి తయారైంది. డీఏలు అడుగుతుంటే ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు పంపుతోంది. గతంలో ఆరేడు డీఏలు పెండింగ్ లో ఉంటే పీఆర్సీతో కలిపి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ డీఏలు అడుగుతుంటే బెదిరిస్తున్నారు. గత జనవరిలో డీఏ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి డీఏలు విడుదల చేయాల్సిన ప్రభుత్వం... అందుకు విరుద్ధంగా ఉద్యోగ సంఘం రద్దు చేస్తామని నోటీసులు పంపింది. ఇక నుంచి ఆ ఉద్యోగ సంఘం ఉనికి కష్టమే. డీఏలు అడిగితే ప్రభుత్వం ఇచ్చేది నోటీసులా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు రెండు శాతం డీఏ ఇచ్చింది. కానీ ఏపీలో సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. డీఏలు అడిగితే బెదిరిస్తున్నారు. ఇంకో సంఘం ప్రశ్నించకుండా నోటీసులు ఇస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు అడిగితే నోటీసులు ఇవ్వడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరి వింతగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ లో బకాయిలు చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ఉద్యోగులు హెచ్చరించారు.

 

ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం వెనుక మరొక కారణం కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పై ఉద్యమించకుండా ముందస్తు హెచ్చరికగా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో ఉద్యోగుల పరిస్థితి ఇలా తయారవ్వడానికి ఉమ్మడిగా పోరాడకపోవడమే. ఉద్యోగ సంఘాలు ఎవరి స్వలాభం కోసం వారు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఉద్యోగ సంఘాల లాలూచీతో సామాన్య ఉద్యోగులు నష్టపోతున్నారు.

 

ఏపీ ఉద్యోగుల పరిస్థితి... పగ వాడికి కూడా రాకూడదు! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *