Top Ad unit 728 × 90

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు…!

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు…!

 

హైదరాబాద్‌- రామగుండం రాజీవ్‌ రహదారిపై ప్రజ్ఞాపూర్‌ వద్ద జగదేవపూర్‌ వెళ్లే దారిలో ఇండియా వన్‌ ఏటీఎం ఉంది. శనివారం రాత్రి దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించి గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి యాజమానికి ఏటీఎం కన్పించకపోవటంతో నిర్వాహకుడికి సమాచారం అందించారు. భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఆయన రాలేదు. సోమవారం ఏటీఎం వద్దకు చేరుకున్న నిర్వాహకుడు గున్న నాగరాజు గజ్వేల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలో రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. సిద్దిపేటకు చెందిన క్లూస్‌ టీం ఘటనా స్థలంలో అధారాలు సేకరించింది. ఏటీఎం లేదని తెలిసి 24 గంటలు గడిచినా పోలీసులకు సమాచారం ఇవ్వటంలో ఎందుకు ఆలస్యమైందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

ఏటీఎంను ఎత్తుకెళ్లేందుకు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దుండగులు శుక్రవారం పగటిపూట రెక్కీ నిర్వహించి శనివారం రాత్రి చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏటీఎంలోకి వెళ్లగానే దుండగులు ముందుగా సీసీ కెమెరాల తీగలు కత్తిరించినట్లు నమోదైందన్నారు. రాజీవ్‌ రహదారిపై పలు సీసీ ఫుటేజీల్లో దొంగల కదలికలు నమోదైనట్లు సమాచారం. ప్రజ్ఞాపూర్‌ ఏసీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరగడం గమనార్హం.

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *