Top Ad unit 728 × 90

కొళత్తూరులో పర్యటించిన సీఎం

కొళత్తూరులో పర్యటించిన సీఎం

 

- అభివృద్ధి పథకాలు ప్రారంభం

 

ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో పలు అభివృద్ధి పథకాలను బుధవారం ప్రారంభించారు.

 

ఆ నియోజకవర్గంలోని తిట్టిగార్డెన్‌ మొదటి వీధిలో వున్న ఇండోర్‌ వాలీబాల్‌ స్టేడియం, బ్యాడ్మింటన్‌ స్టేడియంలను రూ.1.27 కోట్లతో పునరుద్ధరించగా, వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేశారు. అంతేగాక కాసపు వారితో బ్యాడ్మింటన్‌ ఆడారు. అదే విధంగా వీనస్‌ నగర్‌లో రూ.7.75 కోట్లతో నిర్మించిన బీసీ హాస్టల్‌ (BC Hostel) భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రూ.19.56 కోట్లతో చేపట్టిన మురుగునీటి నిర్మూలనా ప్రాజెక్టు, పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం, జంబులింగం మెయిన్‌రోడ్డు నుంచి కుమారప్ప రోడ్డు వరకు కొత్త తాగునీటి పైప్‌లైన్‌ నిర్మాణం, జీకేఎం కాలనీ 24వ వీధి నుంచి పెరియార్‌ నగర్‌ ఫౌంటేన్‌ స్టేషన్‌ వరకు రూ.97 లక్షలతో చేపట్టిన మురుగునీటి పైప్‌లైన్ల నిర్మాణాలకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, బీసీ సంక్షేమశాఖ మంత్రి ఆర్‌ఎస్‌ రాజకన్నప్పన్‌, దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, చెన్నై మేయర్‌ ఆర్‌.ప్రియ, పార్లమెంటు సభ్యులు కళానిధి వీరాస్వామి తదితరులు కూడా పాల్గొన్నారు.

 

కొళత్తూరులో పర్యటించిన సీఎం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *