Top Ad unit 728 × 90

సాంకేతిక పరిజ్ఞానం పట్టించేను…!

సాంకేతిక పరిజ్ఞానం పట్టించేను…!

 

గుర్తుతెలియని వాహనం ఓ మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమవగా, అత్యున్నత సాంకేతికత సాయంతో ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని ఉస్మానియా యూనివర్సిటీ ఠాణా పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం, హబ్సిగూడ-ఉప్పల్‌ ప్రధాన రహదారిపై ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎదురుగా జనవరి 31న ఉదయం 5.45 గంటల సమయంలో ఓ వాహనం ఢీకొట్టడంతో కల్యాణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

 

ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. పలు మార్గాల్లో అనేక సీసీ కెమెరా పుటేజీలను జల్లెడపట్టారు. వాటిలో ఓ నల్లరంగు కారు దాదాపు 100 కి.మీ. వేగంతో పార్కింగ్‌ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని ఏఎన్‌పీఆర్‌(ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ) కెమెరాలను పరిశీలించారు. ఇవి రాత్రిపూట కూడా అతి వేగంతో వెళ్లే వాహనం నంబరును రికార్డు చేస్తాయి. అలా దాదాపు 2 వేల వాహనాల నంబర్లను మదించి కేసు ఛేదించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సందీప్‌కుమార్‌ మాదాపూర్‌ నుంచి వస్తూ ప్రమాదం చేశాడని నిర్ధారణకు వచ్చారు. బోడుప్పల్‌లో నివాసముండే సందీప్‌ను, అతని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.

 

సాంకేతిక పరిజ్ఞానం పట్టించేను…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *