ఆ నోట్లు కూడా రద్దు చేయాలి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఆ నోట్లు కూడా రద్దు చేయాలి... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
మోదీ ప్రభుత్వం 2016 లో రూ. 500, 1000 నోట్లను ఉపసంహరించుకుంది. దాంతో ఏర్పడ్డ కరెన్సీ కొరతను తీర్చడానికి రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటినీ కూడా రద్దు చేసింది.
కాగా… నోట్ల రద్దు గురించి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (మంగళవారం) ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతిని అరికట్టాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
అయితే విద్యుత్ అంశంపై సీఎం చంద్రబాబు నేడు (మంగళవారం) శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని తెలిపారు. 2004లో తన పవర్ పోయింది కానీ పవర్ సెక్టార్‌లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
