Top Ad unit 728 × 90

District News :

అంతా లైవ్ వీడియో కాల్ లోనే, చివరికి...!

అంతా లైవ్ వీడియో కాల్ లోనే, చివరికి...!

 

సైబర్ నేరగాళ్ల మోసాలకు హద్దే లేకుండా పోతోంది. ముఖ్యంగా యువతే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. బాగా చదువుకున్న వారిని కూడా బుట్టలో పడేస్తున్నారు. వారి స్థాయిని బట్టి డబ్బులు పిండేస్తున్నారు. అవతల వాళ్ల అవసరాలు కోరికలను క్యాష్ చేసుకుంటున్నారు. ఊరించి మరీ ఊడ్చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో డేటింగ్ వెబ్ సైట్ ల మోసాల గురించి వింటూనే ఉన్నాం. రోజుకో చోట డేటింగ్ పేరుతో ఆన్ లైన్ లో పలకరించి, దొరికినంత దోచేస్తున్నారని చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. అమ్మాయి కావాలా అంటారు…? కొత్త అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేయాలి అనుకుంటున్నారా అని మెసేజ్ చేస్తారు, మీరు ఒంటరిగా ఉన్నారా, అమ్మాయితో మాట్లాడండి, ఫ్రీగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్ షిప్ కోసం మా వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి ఫీజులేదు అంటారు. ఒకటేంటి, ఇలా పలు రకాలుగా అవతలవారిని అట్రాక్ట్ చేస్తుంటారు. ఎవరైనా బుట్టలో పడితే మొదట బాగానే మాట్లాడుతారు. తరువాత బ్లాక్ మెయిల్ కు దిగి, వారి దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రతి రోజూ వింటూనే ఉంటాం. అయినా కొందరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. వేలల్లో కాదు లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు. మరికొందరైతే క్రెడిట్ కార్డులు వాడీ మరీ అప్పుల పాలవుతున్నారు.

తాజాగా విశాఖపట్నంలోని సైబర్ నేరగాళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. కాల్‌ మీ ఎనీటైమ్‌ మెసేజ్‌తో విశాఖలో భారీ మోసానికి పాల్పడింది ఓ ముఠా. ఆ గ్యాంగ్ ఉచ్చులో చిక్కుకున్నాడు, 24 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అయినా వారి నుంచి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక ప్రవీణ్‌ అనే యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సైబర్ నేరం విషయం వెలుగు చూసింది.

కాల్ మీ ఎనీ టైం అంటూ మెసేజ్ రావడంతో, సరే నిజమో కాదో అని చూద్దామనుకుని ప్రవీణ్ మెసేజ్ చేశాడు. అటు నుంచి కూడా అమ్మాయి మాట్లాడడంతో నిజమే అనుకున్నాడు. అప్పటి నుంచి ఆమె ఆ యువకుడ్ని టెమ్ట్ చేస్తూ ఉండేది. రోజుకు ఇంత అని వసూలు చేస్తూ రెండు మూడు రోజులు వీడియో కాల్ లోనే ఎంజాయ్ చేయొచ్చు అని ఆశ పెట్టింది. అది నమ్మిన ఆ యువకుడు నగ్నంగా ఓ రోజు చాట్ చేశాడు. అప్పటి నుంచి ఆ వీడియో కాల్ ను రికార్డు చేసిన ముఠా, మరుటి రోజు నుంచి బెదిరింపులకు దిగింది. యువకుడి నుంచి పలుమార్లు, మొత్తంగా 24 లక్షల రూపాయాలు వసూలు చేశారు. బెదిరింపులు తట్టుకోలేక ప్రణీత్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠాకు చెందిన మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3.5 లక్షల రూపాయల నగదు, ల్యాప్‌టాప్, 8 ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని క్రైమ్‌ డీసీపీ సురేశ్‌బాబు తెలిపారు.

అంతా లైవ్ వీడియో కాల్ లోనే, చివరికి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *