Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కృష్ణా నదికి భారీగా వరద...!

కృష్ణా నదికి భారీగా వరద...!

 

కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 6.53లక్షల క్యూసెక్కుల ఇన్ప్లో ఉండగా 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి 5.93లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దాదాపు 4.34లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 18 క్రస్ట్గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 4.92లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ఇతర మార్గాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వస్తోంది. 6 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా 6లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు ముంపునకు గురవడంతో కృష్ణా కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. గత నాలుగైదు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 180 టీఎంసీలు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 900 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది.

కృష్ణా నదికి భారీగా వరద...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *