Top Ad unit 728 × 90

టీవీ 9 మాజీ సిఇఓ రవి ప్రకాష్ ఇంట్లో పట్టుబడ్డ ఆర్ధిక నేరగాడు సుకేశ్ గుప్తా...!

టీవీ 9 మాజీ సిఇఓ రవి ప్రకాష్ ఇంట్లో పట్టుబడ్డ ఆర్ధిక నేరగాడు సుకేశ్ గుప్తా...!

  

టీవీ 9 పాత యాజమాన్యంలో ఉన్నంతవరకూ రవిప్రకాశ్ ఓ వెలుగు వెలిగారు. అయితే టీవీ 9 యాజమాన్యం మారిన తర్వాత, టీవీ 9 నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారంటూ కొత్త యాజమాన్యం ఆయనపై ఆరోపించింది, కేసులు పెట్టింది. ఈ విషయంలో ఆయన కొన్ని రోజులు జైల్లోనూ ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. త్వరలో కొత్త ఛానల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

 

ఇప్పుడు మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14 లోని బీఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో, పోలీసులు కొన్నాళ్లుగా వెతుకుతున్న ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా పట్టుబడ్డాడట. అసలు సుకేశ్ గుప్తా ఎందుకు రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్నాడు...? ఆయనకీ రవిప్రకాశ్ కూ ఏలాంటి సంబంధం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుకేశ్ గుప్తా ఓ ఆర్థిక నేరగాడు. ఒకే ఆస్తిని ఇద్దరికి వందల కోట్లకు తాకట్టు పెట్టినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి.

 

ఇప్పుడు ఆ నేరగాడు రవిప్రకాశ్ ఇంట్లో దొరకడం ఏంటి...? ఈ ఆర్థిక వివాదానికి రవిప్రకాశ్ కు సంబంధం ఏంటి...? నిందితులను రవి ప్రకాశ్ ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు. ఈ కేసులోరవిప్రకాశ్ నూ మరోసారి అరెస్టు చేస్తారా...?

 

టీవీ 9 మాజీ సిఇఓ రవి ప్రకాష్ ఇంట్లో పట్టుబడ్డ ఆర్ధిక నేరగాడు సుకేశ్ గుప్తా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *