15 ఏండ్లుగా మియాపూర్లోని అనాథాశ్రమంలో, చివరికి...!
15 ఏండ్లుగా మియాపూర్లోని అనాథాశ్రమంలో, చివరికి...!
పదిహేను ఏండ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలిక.. ఆపరేషన్ స్మైల్ పోలీసుల కృషితో తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరనుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరనుండటం చాలా సంతోషంగా ఉందని మహిళ భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా ట్విట్టర్లో వెల్లడించారు. 2005లో హూస్సేనిఆలం పీఎస్ పరిధిలో అదృశ్యమైన బాలిక ఏడ్చుకుంటూ రోడ్డుపై ఉంటే.. కొంత మంది ఆమెను ఓ అనాథాశ్రమంలో చేర్చారు. అప్పటి నుంచి ఆ బాలిక మియాపూర్లోని అనాథాశ్రమంలోనే ఉంటుంది. శుక్రవారం సైబరాబాద్ యాంటీ హ్యూమన్ యూనిట్ ఆపరేషన్ స్మైల్లో భాగంగా అనాథాశ్రమానికి వెళ్లినప్పుడు బాలికను ట్యాబ్లో ఫొటో దించి వివరాలు సేకరించగా.. ఆమెపై హైదరాబాద్ హుస్సేనీ ఆలం పీఎస్లో మిస్సింగ్ కేసు ఉందని తేలింది. ఆ ఫిర్యాదు ఆధారంగా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో ఉన్నట్లు తెలుసుకుని.. వారికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఆధారాలతో మియాపూర్లో గుర్తించిన బాలికను తమ కూతురేనని తెలిపారు. ఇలా..15 ఏం తడ్ల తర్వాత ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పజెప్పుతుండటం చాలా ఆనందాన్ని ఇస్తుందని స్వాతి లక్రా ట్విట్టర్లో పేర్కొన్నారు.
