Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

రెఫరెండం పెట్టాకే తరలించండి వైకాపా ఎంపీ...!

రెఫరెండం పెట్టాకే తరలించండి వైకాపా ఎంపీ...!

 

 

రాజధాని అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని, వైకాపా ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్‌ పెట్టాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. అమరావతి విషయంలో సీఎం జగన్‌ ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దిల్లీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

 

''అమరావతిలో పెద్ద ఇళ్లు, పార్టీ కార్యాలయం కట్టుకున్నప్పుడు చూసి రాజధాని పట్ల జగన్‌కు చిత్తశుద్ధి ఉందని నమ్మాను. ప్రజలందరూ కూడా దీన్నే విశ్వసించారు. అందుకే జగన్‌కు అద్భుతమైన విజయం వచ్చింది. అలాంటి ప్రజలను జగన్‌ నమ్మించి మోసం చేశారు. దక్షిణాఫ్రికాను చూసి విభజితమైన చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టుకోవడమంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే'' అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

 

''కర్నూలు జుడీషియల్‌ క్యాపిటల్‌ అన్నంత మాత్రన అది రాజధాని అయిపోతుందా? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేదే 45 రోజులు. అందులో ఒకసారి విశాఖలో నిర్వహిస్తామంటున్నారు. అలాంప్పుడు అమరావతి లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఎలా అవుతుంది?'' అని ఎంపీ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం వెనుక ఒకరు ఉన్నారని, ఆయనకు పూర్తి అధికారాలు కట్టబెట్టారని తప్పుబట్టారు. 3 రాజధానులపై రెఫరెండం నిర్వహించే వరకు రాజధాని తరలింపును వాయిదా వేయండి అని కోరారు. ప్రజలు మద్దతు ఇస్తే అప్పుడు ముందుకు వెళ్లండి అని హితవు పలికారు.

రెఫరెండం పెట్టాకే తరలించండి వైకాపా ఎంపీ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *