రాష్ట్రంలో పనిచేయడం కొత్త అనుభవం
రాష్ట్రంలో పనిచేయడం కొత్త అనుభవం
చెన్నై: రాష్ట్ర గవర్నర్‌గా పనిచేయడం తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, ఇక్కడి భాష భిన్నమైనదని, ప్రజలు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారని స్వయంగా తెలుసుకున్నానని గవర్నర్ ఆర్ఎన్ రవి అన్నారు.
రాజ్‌భవన్‌లో ట్రైనీ ఐఏఎ్‌సలతో ఆయన సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారి ప్రశ్నలను ఆయన సమాధానమిస్తూ... నాగాలాండ్ గవర్నర్‌గా నియమించినప్పుడు ఇతర రాష్ట్రాలకు భిన్నమైన ప్రాంతం కావటంతో అక్కడ శాంతిభద్రతలను పటిష్టం చేయడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తర్వాత తనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నానని, ప్రస్తుతం తమిళ భాష నేర్చుకుంటున్నానని, తమిళ పత్రికలు చదువుతున్నానని వెల్లడించారు.
ఇక్కడి ప్రజలు చాలా మంచివారని, తమిళం ఏడు వేల సంవత్సరాల కంటే ప్రాచీనమైదని, తమిళ సాహిత్యం కూడా పురాతనమైనదని, కానీ దేశంలోని ఇతర ప్రాంతాలకు తమిళభాష గొప్పదనం తెలియకపోవడం బాధాకరమన్నారు. తమిళ భాష ఔన్నత్యాన్ని దేశమంతటా ఎలుగెత్తి చాటేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేపడుతోందన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, చార్రితక ప్రదేశాలను సందర్శించడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లందరూ రాష్ట్రంలోని మారుమూల ప్రాతాలకు వెళ్తే ప్రాచీన దేవాలయాలు, రామేశ్వరం, మదురై మీనాక్షి ఆలయం, తంజావూరు తదితర ఆలయాలను సందర్శిస్తే వాటి శిల్పకళా సౌందర్యం ముందు గ్రీకు వాస్తు శిల్పాలన్నీ దిగదుడుపేనని గవర్నర్ అన్నారు. కార్యక్రమం అనంతరం ట్రైనీ ఐఏఎ్‌సలు ఆయనతో కలిసి గ్రూపు ఫొటో తీసుకున్నారు.
