Top Ad unit 728 × 90

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రూటే సెపరేటు...!

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రూటే సెపరేటు...!

 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రూటే సెపరేటు. ప్రధాన మోదీ నుంచి సామాన్యుల వరకు అందరూ కొవిడ్ రూల్స్ పాటిస్తూ మాస్క్ ధరిస్తుంటే ఆయన మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఆయనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అయిన మాధవ్ ఇది వరకే ఎన్నో కార్యక్రమాల్లో మాస్క్ ధరించకుండానే పాల్గొని విమర్శపాలయ్యారు. అయితే తాజాగా జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కూడా మాధవ్ తన పంతాను మార్చుకోలేదు. కార్యక్రమంలో అందరూ మాస్క్ ధరించినా మాధవ్ మాత్రం మాస్క్ పెట్టుకోలేదు.

 

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో గొర్రెల పెంపక క్షేత్రం వద్ద నూతనంగా 63 ఎకరాలలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం మాస్క్ లేకుండానే కనిపించారు. అయినా అక్కడ ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు మాస్క్ వేసుకోమని ఎంపీకి సూచించేందుకు వెనకంజ వేశారు.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది కూడా. మాస్క్ లేకపోతే జరిమానా కూడా విధిస్తున్నారు. అయినా నలుగురికి చెప్పాల్సిన నాయకులే ఇలా చేస్తుంటే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన సామాన్య జనం సాక్షాత్తు ఎంపీయే మాస్క్ పెట్టుకోడు.. మేము ధరించకపోతే తప్పెలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సీఎం జగన్ కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాస్క్ ధరించలేదు. ఆ విషయంపై మీడియా ఎన్నిసార్లు చెప్పినా ఆయన కూడా తన పంథాను మార్చుకోలేదు. దీంతో సీఎం జగన్‌ను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకుంటూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పాటించనప్పుడు తామెందుకు పాటించాలనే భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రూటే సెపరేటు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *