Top Ad unit 728 × 90

ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు. విజయవాడలో తొలిస్టాల్‌

ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు. విజయవాడలో తొలిస్టాల్‌

రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్‌ఎఫ్‌ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు.
 

మూపురం కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్‌ ప్రొటీన్‌ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఎక్కువ. విజయవాడ, వైజాగ్‌లో లీటర్‌ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు.

రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్‌ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్‌ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు. విజయవాడలో తొలిస్టాల్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *