Top Ad unit 728 × 90

మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు

మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు...!

 

సుందరకాండ అద్భుతమైన పారాయణం. ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.  ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు. అయితే, అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.  పారాయణ నియమాలతో ఉంటుంది.

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.

 

1. ఆపదలు తొలగటానికి, సంపదలు కలగటానికి:

శ్లోకం. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు, 108 సార్లు, శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.

 

2. విద్యాప్రాప్తికి: ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను. 3 రోజులు ద్రాక్ష, అరటిపళ్ళు నివేదన

 

3. భూతబాధ నివారణకు: 3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు, 30 దినములు పారాయణ చేయవలెను. 1 కొబ్బరికాయ, అరటిపళ్ళు నివేదన.

 

4. సర్వ కార్య సిద్దికి: 64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

 

5. శత్రు నాశనముకు: 51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు, 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.

 

6. వాహనప్రాప్తికి: 8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు, 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి, దానిమ్మ నివేదన చేయవలెను.

 

7. మనశాంతికి: 11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు, 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

 

8. స్వగృహం కోరువారికి: 7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి, 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.

 

9. యోగక్షేమాలకు: 13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు, 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి, దానిమ్మ నివేదన చేయవలెను.

 

10. ఉద్యోగప్రాప్తికి: 63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు, 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి, దానిమ్మ నివేదన చేయవలెను.

 

11. రోగ నివారణకు: 34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము, 21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.

 

12. దుఃఖనివృత్తికి: 67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు, 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.

 

13. దుస్వప్న నాశనానికి: 27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

 

14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు: 33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి, 21 దినములు నిష్ఠతో పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

 

15. ధనప్రాప్తికి: 15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పఠించవలెను. అరటిపళ్ళు, పటిక బెల్లం మరియు రామాయణంలో అయోధ్యకాండలో యాత్రాదానము, 32 వ సర్గ 1 సారి, 40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను. (అగస్త్య, పరాశర, ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది).

 

16. దైవాపచారా ప్రాయశ్చిత్తం: 38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.

 

17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు: 19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

 

18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు: సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 68 రోజులు చదువవలెను. నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.

 

19. కన్యా వివాహమునకు: 9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను. అప్పాలు, పాలు, పంచదార నివేదన చేయవలెను.

 

20. విదేశీ యానమునకు: 1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

 

21. ధననష్ట నివృత్తికి: 55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయవలెను.

 

22. వ్యాజ్యములో విజయమునకు: 42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు, 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు,  ద్రాక్ష, దానిమ్మ నివేదన చేయవలెను.

 

23. వ్యాపారాభివృద్ధికి: 15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

 

24. పుత్ర సంతానానికి: ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, కొబ్బరికాయ, నివేదన చేయవలెను. శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను. సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.

 

25. ఋణ విముక్తికి: 28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

 

శ్రీరామ జయరామ జయ జయరామ.

మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *