Top Ad unit 728 × 90

అర్థం చేసుకుంటే జీవితం పదిలం. లేకుంటే...!

అర్థం చేసుకుంటే జీవితం పదిలం. లేకుంటే...!

 

బలహీనపడుతున్న బంధాలు. చిన్న చిన్న కారణాలకే ఘర్షణ. పనిభారంతో సతమతమవుతున్న మహిళా ఉద్యోగులు. భార్యాభర్తలు తమ విధుల్లో సహకరించుకుంటే సత్ఫలితాలు. ఇంట్లో పెద్దల సమక్షంలో సమస్యలు పరిష్కరించుకోవాలంటున్న సైకాలజిస్టులు.

 

కరోనా పరిస్థితులు దంపతుల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో వర్క్‌ ఫ్రం హోం, వెంటాడుతున్న వైరస్‌ భయం, విరామం లేని పని, ఇంట్లోనే ఉండాల్సి రావడం తదితర కారణాలతో ఆలు మగలూ ఒత్తిడికి గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది దంపతులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఒకరికి ఒకరూ అండగా నిలబడితేనే జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందని వారికి అవగాహన కల్పిస్తున్నారు. చాలా వరకు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న దంపతులు తమ పెద్దలను కొవిడ్‌ భయంతో సొంతూళ్లకు పంపించారు. దీంతో ఓవైపు ఇంటి బాధ్యత. మరోవైపు పిల్లలను చూసుకోవడం లాంటి పనులతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక బాస్‌ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తున్నదని ఓ ఉద్యోగి వాపోయారు. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే తత్వం లేకపోతే బంధాలు చీలిపోయే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

 

ఆలూమగలన్నాక చిరాకులు, పరాకులు సహజం. చిన్నచిన్న వాటికే ఇదైపోతూ తేగేదాక లాగితే బంధం బలహీనపడుతుంది. అనుమానాలు తొంగిచూస్తాయి. అపార్థాలు ఎడం పెంచుతాయి. దంపతుల మధ్య అనురాగాలు శ్రుతిలో సాగాలంటే కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. కొవిడ్‌ పరిస్థితులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరిపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై ఎక్కువే. వారు ఇంటి పని, పిల్లల బాధ్యత చూసుకుంటూనే విధులు నిర్వర్తించడం

 

చేయూతనిస్తేనే జీవితం బాగుంటుంది. పనిభారంతో భార్య అదోలా ముఖం పెట్టుకున్నా, ఆఫీస్‌ ఒత్తిళ్లతో భర్త చిరాకుగా కనిపించినా, అదే క్షణంలో ఎందుకలా ఉన్నావ్‌...? అంటూ యక్షప్రశ్నలు అడుగొద్దు. కాస్త స్థిమితపడిన తర్వాత విషయం ఏంటని తెలుసుకోవాలి. తోచిన సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి. భర్త పనులు చక్కబెట్టడంలో భార్య తనవంతు పాత్ర పోషించాలి. అలాగే భార్య విధుల్లోనూ భర్త సహకరించాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు దాంపత్యంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.

 

దంపతుల్లో ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే ఇగోల సమస్య రాదు. నాదే పై చేయిగా ఉండాలనే ధోరణిని కట్టిపెట్టండి. ఏ నిర్ణయం తీసుకున్నా జీవిత భాగస్వామితో చర్చించాలి. అప్పుడు ఇద్దరం సమానమేనన్న భావన కలుగుతుంది. ఒకరిపై ఒకరికి గౌరవమూ పెరుగుతుంది.

 

భార్య ఇచ్చే సూచనలు భర్త మన్నించే ప్రయత్నం చేయాలి. అలాగే ఫలానా చేద్దామనుకుంటున్నానని భర్త అన్నప్పుడు వెంటనే తోసిపుచ్చొద్దు. అందులోని మంచి-చెడులు ఆలోచించి అప్పుడు నిర్ణయాన్ని తెలియజేయాలి.

 

అన్నింటికన్నా ముఖ్యమైన దాంపత్య సూత్రం మూడో వ్యక్తి మాటలను గుడ్డిగా నమ్మకండి. ఆలూమగల మధ్య సవాలక్ష ఉంటాయి. వాటిని చక్కదిద్దుకునే బాధ్యత మీదే అని గుర్తించుకోవాలి. మూడో వ్యక్తి మాటలతో సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. అంతగా అవసరం అనుకుంటే ఇద్దరూ కలిసి ఇంట్లో పెద్దల సమక్షంలో ఇబ్బందులపై చర్చించాలి.

అర్థం చేసుకుంటే జీవితం పదిలం. లేకుంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *