Top Ad unit 728 × 90

చావు రహస్యం తేలిపోనుంది…!

చావు రహస్యం తేలిపోనుంది…!

 

పుట్టుక, చావు మన చేతుల్లో లేవు, మనముందున్న క్షణమే జీవితం. ఇదో తత్వం. చావు గురించిన రహస్యాలు ఎవరికీ తెలియవు. మరణించాక మనం ఎలా ఉంటాం…?

 

ఏమైపోతాం? బాడీ పని చేయకున్నా. ఆలోచనలు కొనసాగుతాయా? పురాణాల్లో ఉన్నట్టు బాడీ కాకుండా ఆత్మ సెపరేట్‌గా ఉంటుందా? ఇక, దెయ్యాలు, భూతాల స్టోరీ వేరు. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు చావు గురించిన గుట్టు ఒక్కొక్కటిగా విప్పుతున్నాయి. త్వరలోనే చావు రహస్యాలను బట్టబయలు చేసేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలను స్థూలంగా ఇక్కడ చర్చించుకుందాం.

 

ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో ప్రాణం, మరణానికి మధ్య మరో దశ ఉంటుందని, అదే థర్డ్ స్టేట్ అని తేలింది. మరణించిన బాడీలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు.. ఒక మల్టీసెల్యూలర్‌గా ఏర్పడి జీవం పోసుకుంటుందని కనిపెట్టారు. ఇది ఇప్పటి వరకున్న ప్రాణం, చావు అవగాహనకు భిన్నంగా కణాల ప్రవర్తనకు సంబంధించి సరికొత్త వివరాలను తెలుపుతున్నది.

 

ఈ థర్డ్ స్టేట్ అంటే ఏమిటీ…?

అవయవాలు మరెప్పుడూ పని చేయలేని స్థితిని చావు అని అర్థం చేసుకోవచ్చు. కానీ, అవయవ దానం చేసినప్పుడు.. అందులోని కణాలు సదరు జీవి మరణం తర్వాత కూడా పని చేస్తాయి. మనిషి చనిపోయాక కూడా మన కణాలు ఎలా పని చేస్తాయి? ఏ మెకానిజం వాటిని అలా పని చేయనిస్తున్నాయి? అనే ఆసక్తికర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు పరిశోధకులు ఈ మార్పులను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరైన పరిస్థితుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి కొత్త జీవాన్ని పోసుకుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ కణాలకు పోషకాలు, ఆక్సిజన్ లేదా బయోఎలక్ట్రిసిటీ అందించినప్పుడు అవి మల్టిసెల్యూలర్ స్ట్రక్చర్‌గా ఎదుగుతాయని తెలియవచ్చింది. ఆ కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయని పనలను ఇలా మల్టిసెల్యూలర్‌గా ఏర్పడ్డాక చేస్తాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

 

ఉదాహరణకు.. చనిపోయిన కప్ప చర్మ కణాలను తీసి ల్యాబ్‌లో భద్రపరిచారు. ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణ జీవిగా రూపాంతరం చెందుతుంది. కప్ప సజీవంగా ఉన్నప్పుడు సిలియాను స్రావాలను పంప్ చేయడానికి ఉపయోగపడేది. కానీ, జెనోబాట్‌గా మారాక అది నేవిగేషన్ కోసం ఉపయోగపడుతుంది.

 

మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను ఇలాగే ల్యాబ్‌లో సరైన కండీషన్స్‌లో భద్రపరిస్తే.. అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకుని దానికదిగా కదిలేంత శక్తి లేదా సొంతంగా రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని పొందింది. అయితే, ఈ కణాల మనుగడ వాటి చుట్టూ ఉండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మెటబాలిక్ యాక్టివిటీ, భద్రపరిచే విధానంపైనా ఉంటుంది. ఉదాహరణకు మనిషి చనిపోయాక 60 గంటల తర్వాత తెల్ల రక్తకణాలు చనిపోతాయి. అదే ఎలుక అస్థిపంజర కణాలు 14 రోజులపాటు మరణించవు. క్రయోప్రిజర్వేషన్ వంటి టెక్నిక్ ఉపయోగిస్తే.. ఎముక మజ్జ సజీవంగా ఉన్నా కణాల్లాగే ఉండగలదు.

 

ఈ కణాల మనుగడ, దాని వెనుక ఉన్న మెకానిజాన్ని అర్థం చేసుకుంటే ఇంకా ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తాయి. చాలా విషయాలపై ఇంకా సందిగ్దతే ఉన్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న శాస్త్ర పరిశోధనలు జీవం, మరణం వెనుకగల రహస్యాలను ఛేదించే దిశగా సాగుతున్నాయి.

 

చావు రహస్యం తేలిపోనుంది…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *