Top Ad unit 728 × 90

ప్రత్యేకంగా కళ్ళజోళ్ళు కొనుగోలుచేసి  ఉచితంగా పంపిణీ చేసిన…!

ప్రత్యేకంగా కళ్ళజోళ్ళు కొనుగోలుచేసి  ఉచితంగా పంపిణీ చేసిన…!

 

PSLV TV (నూజివీడు): జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరిట చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తూ, పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన తిరివీధి కృష్ణ అభినందనీయులని నూజివీడు ప్రాంతీయ రవాణా అధికారి కేఆర్ రవి కుమార్ అన్నారు. తిరివీధి రామారావు సేవా ట్రస్ట్, తిరివీధి లక్ష్మి సేవా ట్రస్ట్, నూజివీడులోని అమెరికన్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ద్వారా పరీక్షలు చేయించుకున్న నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరులో  50 కుటుంబాలకు ప్రత్యేకంగా కళ్ళజోళ్ళు కొనుగోలు చేసి సోమవారం నాడు  ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నూజివీడు ప్రాంతీయ రవాణా అధికారి కేఆర్ రవి కుమార్ మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను పున్నామ నరకము నుండి రక్షించువాడు పుత్రుడయితే, తల్లిదండ్రులు మరణించినా వారి జ్ఞాపకాలు చిరస్థాయిగా మిగిలి ఉండాలని వారి ఆశయ సాధన కోసం పేదల సేవకు అహర్నిశలు కృషి చేస్తున్న తిరి వీధి కృష్ణ నేటి యువతకు ఆదర్శం అని పేర్కొన్నారు. తిరి వీధి కృష్ణ జీవితం మార్గదర్శకం కావాలన్నారు.

 

పేదల సేవకు తాను ఎప్పుడూ రెడీ అంటూ... 9640324266, 8499026392 నంబర్లలో పూర్తి వివరాలకు సంప్రదించాలని కృష్ణ కోరడం మరో విశేషంగా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా  నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, చిత్తపూరులో గత నెల 5వ తేదీన  తిరి వీధి రామారావు సేవా ట్రస్ట్, తిరివీధి లక్ష్మి సేవ ట్రస్ట్, అమెరికన్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తల్లిదండ్రులు జీవించి ఉండగానే ఆస్తులను చేజిక్కించుకుని,  వారిని రోడ్ల పైకి నెట్టే సంస్కృతి నేడు సమాజంలో చూస్తున్నామన్నామని తిరివీధి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు  రక్షణ మహావృక్షం కంటికి రెప్పలా కాచానని, తల్లిదండ్రుల మరణానంతరం వారు కోరుకున్న రీతిలో పేదలకు వైద్య సేవలు అందించడం తన కనీస ధర్మంగా తిరివీధి కృష్ణ పేర్కొన్నారు.

 

పేదలకు అందించే సేవలో తల్లిదండ్రులను చూసుకోగలగడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు.  కుగ్రామంగా ఉన్న తన స్వగ్రామ ప్రాంతంలో పేదలకు కంటి వైద్యం, అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు వైద్య నిపుణులను తీసుకు రావడం, అందరూ సహకరించడం సంతోషం కలిగించిందన్నారు. ప్రత్యేకమైన కళ్ళజోళ్ళను 50 కుటుంబాలకు కొనుగోలు చేసి ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకున్న ప్రజలకు, ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు ద్వారా సేవలందించిన వైద్యనిపుణులు, చాట్రాయి ఎండిఓ పివీ ఎస్ నాగేశ్వరరావు, ఈవోపీఆర్డీ నాగరాజులకు సంబంధించిన సందర్భంగా తిరువీధి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ క్యాంపులో నేత్ర వైద్య సేవలు 100 మంది, మెగా మెడికల్ క్యాంపు ద్వారా మరో 150 మంది వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

 

వివిధ వైద్య పరీక్షలలో అవసరమైన 50 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత నెల ఐదో తేదీన నిర్వహించిన వైద్య శిబిరంలో అమెరికన్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, చిన్న పిల్లల విభాగం ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్విన్ రాజ్, ఆర్థోపెడిక్ విభాగం వైద్య నిపుణులు డాక్టర్ శ్యామ్ జేమ్స్, కంటి విభాగం వైద్య నిపుణులు డాక్టర్ జమృధ్ షాహిన్, డాక్టర్ చిగురుపాటి హాసిత, స్త్రీ మరియు ప్రస్తుత విభాగం వైద్య నిపుణులు డాక్టర్ మృదుల్ సింఘె, జనరల్ వైద్య విభాగం వైద్య నిపుణులు డాక్టర్ పొలంకి భరత్ కుమార్ రెడ్డికి, మరికొందరు వైద్యనిపుణులు, చాట్రాయి మండల ఈ ఓ పి ఆర్ డి నాగరాజు, క్యాంపు నిర్వాహకులు తిరివిది కృష్ణ, సభ్యులు, సేవా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్న అందరికీ ఈ సందర్భంగా తిరివీధి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేకంగా కళ్ళజోళ్ళు కొనుగోలుచేసి  ఉచితంగా పంపిణీ చేసిన…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *