Top Ad unit 728 × 90

District News :

నేడు మొదటి శ్రావణ మంగళవారం. వరలక్ష్మీ, మంగళగౌరీ వ్రతం విధానాలు ఏంటి...?

నేడు మొదటి శ్రావణ మంగళవారం. వరలక్ష్మీ, మంగళగౌరీ వ్రతం విధానాలు ఏంటి...?

 

మహిళలకు చాలా ఇస్టమైంది శ్రావణ మాసం. ముఖ్యంగా పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ఈ నెల చాలా ప్రాముఖ్యం. శ్రావణ మాసం అంటేనా అందరికీ ముందుగా గుర్తుకొచ్ఛేది 'వరలక్ష్మీ వ్రతం' ఈ వరలక్ష్మీ వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం 'మంగళ గౌరీ వ్రతం'. దీనిని 'శ్రావణ మంగళవార వ్రతం' అని,'మంగళ గౌరీ నోము' అని కూడా పిలుస్తుంటారు. మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే, మహిళలు తమ 'ఐదవతనం' కలకాలం నిలుస్తుందని కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అందుకనే శ్రావణ మాసమంలో మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ, మంగళగౌరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు ఐదు సంవత్సరాలు చేస్తారు. వివాహం ఐన మొదటి సంవత్సరము పుట్టినింతిలోనూ తరువాత నాలుగేళ్లు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి పండితులు చెబుతున్నారు.

వ్రత విధానం ఏంటంటే: శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ. పండు, తాంబూలంతో వాయనాలిస్తారు. కుదిరితే అందరి ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు. లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు.

మంగళ గౌరీ వ్రతం మొదలు పెట్టిన తర్వాత అయిదేళ్లు అయ్యాక, ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి, మట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, పసుపు, కుంకుమ తదితర మంగళకరమైన వస్తువులను పెట్టి పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్ధతి లోపించినా ఫలితం లోపించదు. ఈ శ్రావణ మంగళవార వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుపుకుంటారు.

శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మిదేవి వ్రతం ఇలా శ్రావణ మాసంలో చాలా పూజలే ఉన్నాయి. శ్రావణ మాసం ఈసారి ఆగస్టు 9న ప్రారంభమైంది. సెప్టెంబరు 7 వరకు శ్రావణమాసం ఉంటుంది. ఉపవాసం మొదలు పూజలు వరకు భక్తి శ్రద్ధలతో మహిళలు చేసి తమ ఇష్టదైవాన్ని కొలుస్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. అందుకని ఈ మాసంలో భక్తులు ఉపవాస దీక్ష లో పాల్గొని స్వామి వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల కడలి నుండి ఆవిర్భవించినట్లు చెబుతూ ఉంటారు. అమ్మ వారి కంటే ముందుగా సముద్రం నుండి విషం బయటికి వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడు అని అంటారు. దీని కారణంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్దఎత్తున పూజలు చేస్తారు. శ్రావణమాసంలో ప్రత్యేకంగా పూజలు చేసి నోములు చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ నెల గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు మంచిదని మత్స్యపురాణం చెబుతోంది. ప్రతి సోమవారం మహా లింగార్చన ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని కూడా పూజిస్తారు. భక్తులు మనసుతో ఆరాధిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు.

నేడు మొదటి శ్రావణ మంగళవారం. వరలక్ష్మీ, మంగళగౌరీ వ్రతం విధానాలు ఏంటి...? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *