Top Ad unit 728 × 90

ఈ ఆన్ లైన్ చీటింగ్ మోసాన్ని చదివి కాస్త…!

ఈ ఆన్ లైన్ చీటింగ్ మోసాన్ని చదివి కాస్త…!

 

అది బెంగళూరు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి పేరెంట్స్ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. పనిలో పనిగా ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో అతని ఫొటో, వివరాల్ని ఉంచారు. ఓ అందమైన అమ్మాయి వాటిని చూసింది. ఓ రోజు ఫోన్ చేసింది. పక్కా అమాయకురాలిలా మాట్లాడింది. ప్రతి దానికీ అవునా నాకు తెలీదు, మీరు సూపర్ అంటూ... మెచ్చుకుంటూ మాటలు కలిపింది. అతను మరింత అమాయకుడిలా ఉన్నాడు. ఆమె నాలుగు మాటలు మాట్లాడగానే తెగ సంబర పడిపోయాడు. ఇలా అతనితో మాట్లాడుతున్నప్పుడు, ఆమెకు మరో కాల్ వచ్చింది. జస్ట్ ఏ మినిట్, ఫాదర్ కాల్ చేస్తున్నారు అంటూ కాల్ కట్ చేసింది.

ఆ తర్వాత మళ్లీ నెక్ట్స్ డే అతను కాల్ చేశాడు. ఇద్దరూ కొంచెం ఎక్కువ సేపే మాట్లాడుకున్నారు. నీ ఫొటోలు పంపవా చూస్తాను అన్నాడు. ఫొటోలు చూడకుండా చేసుకోలేరా అంది. చేసుకోగలను, కానీ పేరెంట్స్‌కి కూడా చూపించాలిగా అన్నాడు. నేను చాలా అందంగా ఉంటాను. నన్ను ఇప్పటికే చాలా మంది ప్రపోజ్ చేశారు. బట్, నేను కమిట్ అవ్వలేదు అంది. తెగ ఆనందపడిపోయాడు. ఎవరికీ దక్కని అమ్మాయిని తానే చేసుకుంటున్నానని లోలోపల ఖుషీ అయిపోయాడు. ఫొటోలు పంపింది. అవి చూశాక, ఆకాశంలో తేలిపోయాడు. (అవి నకిలీవని తెలియక) ఆ తర్వాత ఇద్దరూ వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాలింగ్స్ చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. గురుడు ఓకే అంటూ కమిట్ అయ్యాడు. ఆ తర్వాత అసలు డ్రామా మొదలుపెట్టింది. సడెన్‌గా ఓ రోజు ఏడవడం (దొంగ ఏడుపు) మొదలు పెట్టింది. ఏం జరిగింది అని కంగారుగా అడిగితే, తమకు తెలిసిన ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందని కహానీ చెప్పింది. అర్జెంటుగా డబ్బులు కావాలంటూ రూ.లక్ష లాగేసింది. పెళ్లి కోసం కొన్నేళ్లుగా డబ్బులు దాస్తున్న అతను, ఆమె అడగ్గానే పూర్తి నమ్మకంతో అప్పటికప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు.

ఆ తర్వాత మరికొన్ని రోజులకు మరో డ్రామా. ఇలా చాలా డ్రామాలు ఆడింది. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కహానీ చెప్పి లక్షలు లాగేసింది. మొత్తం రూ.16 లక్షల 82 వేలు స్వాహా చేసింది. ఆ తర్వాత నుంచి, అతనితో మాట్లాడటం మానేసింది. అతను కాల్ చేస్తే, కట్ చేస్తోంది. గురుడికి గుండెల్లు గునపాలు గుచ్చిన ఫీలింగ్. ఓ రోజు కాల్ రిసీవ్ చేసుకుంది. ఫుల్లుగా ఫైర్ అయ్యాడు. "నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నీ నిజస్వరూపం పెళ్లికి ముందే బయటపడింది. నీకూ నాకూ పెళ్లి వద్దు. నీకో దండం" అంటూ కల్ కట్ చేసింది. షాక్ అయ్యాడు. మరి మనీ సంగతి ఏంటి అని అడుగుదామంటే, నో ఛాన్స్.

వైట్ ఫీల్డ్ పోలీసుల్ని కలిసి లబోదిబోమన్నాడు. అంత గుడ్డిగా ఎలా నమ్మావయ్యా అంటే, ఏమో సార్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. కంప్లైంట్ రాసుకున్న పోలీసులు ఆమెను త్వరలోనే కనిపెట్టి మొత్తం మనీ వెనక్కి లాగుతామన్నారు. అదే ఆశతో అతను ఇంటికి బయల్దేరాడు.

ఈ ఆన్ లైన్ చీటింగ్ మోసాన్ని చదివి కాస్త…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *