Top Ad unit 728 × 90

దారుణం: పగోడికి కూడా ఈ పరిస్థితి రావొద్దు మరి.

దారుణం: పగోడికి కూడా ఈ పరిస్థితి రావొద్దు మరి...!

 

మనిషి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక యవ్వనం ఒంటిమీదికి వచ్చి వేధిస్తున్న వారి పరిస్థితి చూడాలి మరి. ఎప్పుడు పెళ్లి అవుతుందా...! ఎప్పుడెప్పుడు దేహం దాహం తీర్చేద్దామా? అని ఆరాటపడుతుంటారు. ఈ పరిస్థితి ఆడమగా ఇద్దరికీ ఉన్నప్పటికీ, మగాళ్ల కథ వేరుగా ఉంటదని అందరికీ తెలిసిందే.

 

ఐతే, ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ వాసి వన్ ఫైన్ డే పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రులు ఘనంగా ఒక ఇంటివాడిని చేశారు. ఇక మనోడు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అదేనండీ, మూడు రాత్రుల్లో తొలిరాత్రి రానే వచ్చింది. ఎంతో ఆశగా శోభనం గదిలోకి వెళ్లిన పురుష పుంగవుడిని ఆఖరి సమయంలో మన వెండితెర ఓంకార్ లాగా ‘ఒక్క నిమిషం’ అంటూ ఆపింది సదరు పెళ్లి కూతురు.

సూర్యవంశం సినిమాలో మీనా గనక వెంకటేష్ ను ఆపినట్టు.. ఏవేవో కారణాలు చెప్పి ఫస్ట్ నైట్ ను వాయిదా వేద్దామని చెప్పింది. నీళ్లు చల్లిన పాలపొంగులా చప్పున చల్లారిపోయాడు సదరు భర్త. సర్లే, ముద్దుల భార్య మొదటి కోరిక ఏదో కోరిందికదా... ఆ తర్వాత చూసుకుందాం అని మనోడు దిండు దుప్పటి తీసుకొని పక్కన పడుకోవాల్సినోడు పక్కకెళ్ళి పడుకున్నాడు.

కాలం ఆగదు గదా... భార్య చెప్పిన గడువు తీరిపోయింది. మళ్లీ చేతికి మల్లెపూలు ఒంటికి సెంటు కొట్టకుని బయల్దేరాడు అమాయకుడు. ఏవండీ, ‘ఒక్క నిమిషం’ అంది మళ్లీ. ఈసారేం మాయరోగం వచ్చిందంటూ విసుక్కున్నాడు. మళ్లీ ఏదో కారణం చెప్పింది. ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో ఆలీ మాదిరిగా నాకేదో శోభన గండం ఉన్నట్టుందంటూ ఏడ్చుకుంటూ బయటకొచ్చాడు.

ఇక మూడోసారి కూడా మూడ్ తెచ్చుకొని బెడ్ ఎక్కగానే, మళ్లీ ‘ఒక్క నిమిషం’ అన్నది. ఈ విధంగా... దాదాపు ఐదు నెలలు గడిచిపోయాయి. కానీ, ఆమె చెప్పిన ఒక్క నిమిషం సమయం మాత్రం అయిపోవట్లేదు. దీంతో, భర్తకు డౌటొచ్చింది. ఇదేదో యవ్వారంలా ఉందని ఒంట్లో ఏదైనా సమస్య ఉన్నట్టుందని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాడు. పరిశీలించిన డాక్టరు, అసలు నిజం చెప్పాడు.

అది విన్న భర్తకు పాత సినిమాల్లో గనక కొండల్లో బాంబు బ్లాస్టులు జరిగినట్టు, సముద్ర కెరటాలు అంతెత్తున ఎగిసిపడ్డట్టు అయ్యింది. ఇంతకీ, డాక్టర్ చెప్పిన విషయం ఏమంటే. తన భార్య స్వతహాగా అమ్మాయి కాదు. ఓ ట్రాన్స్ జెండర్ అని అసలు బయట పెట్టారు సదరు డాక్టర్. ఎన్నాళ్ళ నుండో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆ అభాగ్యుడి  ఆశలు ఆవిరైపోయి, జీవితమే సర్వనాశనం అయిపోయినట్టు అనిపించింది. ఇక ఇంత జరిగిన తర్వాత ఎవరైనా ఏమంటారు...? అతగాడు కూడా అదే అన్నాడు. నాకు ఈమె వద్దు గాక వద్దు. నన్ను మోసం చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆమె కూడా తనను నిర్బంధించారని భర్తపై ఫిర్యాదు చేసింది. ఇరు వర్గాలతో పోలీసులు మాట్లాడగా... భర్త మెడికల్ సర్టిఫికెట్ పోలీసుల ముందు పెట్టాడు. కావాలనే ఈ విషయం దాచి తనకు పెళ్లి చేశారని అన్నాడు. ఐదు నెలలుగా దగ్గరికి రానివ్వలేదని ఇలాంటి ఈమెను తానేం చేసుకోవాలని ప్రశ్నించాడు. మొత్తానికి ఆ పంచాయతీ అలా సాగుతోంది. చిరికి ఏం తీర్పునిస్తారో చూడాలి మరి. కానీ, ఎంత ఘోరం సుమా...! పగోడికి కూడా ఈ పరిస్థితి రావొద్దు మరి.

దారుణం: పగోడికి కూడా ఈ పరిస్థితి రావొద్దు మరి. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *