Top Ad unit 728 × 90

District News :

భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభిస్తుంది...!

భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభిస్తుంది...!

 

హర హర మహాదేవ శంభో శంకర. “శివలింగం" నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పర తత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వ స్వరూపమే "లింగం"

 

లింగాభిషేకములో పరమార్ధం: గౌరీ పీఠం లేదా పానవట్టం పై శివలింగం. అంటే, మానవుని హృదయ పద్మంపై ఆత్మలింగము.

 

పంచామృతాలు: 1) భక్తీ 2) మంత్రజపం 3) నామస్మరణం 4) ధ్యానం 5) కీర్తనలతో దైవాభిషేకం చేయాలి.

"జలధారాపాత్ర" అనన్య అచంచల నిరంతర సాధనా భక్తికి చిహ్నం.  లింగం జీవాత్మకు సంకేతం.

జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం. శివుడి ఐదు ముఖాలను "పంచ బ్రహ్మలు" గా పండితులు చెబుతారు.

వాటి పేర్లు... సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన"

 

ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన "భూమి, నీరు అగ్ని, గాలి, ఆకాశాన్ని" సూచిస్తుంది. ఓం కారం తు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవమ్

అకారోకారమంతాయ ఓంకారాయ నమో నమ:

న నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర

నమస్తే వృషభారుఢ నకారయ నమో నమ:

మ: మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం

మహా నటవరం వందే మకారాయ నమో నమ:

శి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకమ్

శివమేకపదం దేవం శికారాయ నమో నమ:

వా వాహనం వృషభో యస్య వాసుకి: కంఠభూషణమ్

వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమ:

య యత్ర యత్ర స్థితో దేవ: సర్వవ్యాపీ మహేశ్వర:

యల్లింగం పూజయేన్నిత్యం యకరాయ నమో నమ:

 

శివ భక్తుడైన "సౌనందగణేశ ముని" ఒకసారి యమలోకానికి వెళ్లగా,  యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి, ఓ జనులారా! ఇది ఓం నమశ్శివాయఅనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు.  ముని చెప్పగా వారంతా "పంచాక్షరి"ని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట. ఆ మహర్షి వారికి "పంచాక్షరి" మంత్రానికి అర్థం బోధించలేదు.

కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది.  అర్థయుక్తంగా ఉచ్చరిస్తే "అధికస్య అధికం ఫలమ్‌" అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.

 

ఓం నమఃశివాయ

భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభిస్తుంది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *