Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

సూర్యుడు తులారాశిలో ప్రవేశం, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం…!

వివరణ: డాయంఎన్చార్యప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషజాతకవాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులుసునంద రాజన్ జ్యోతిషజాతకవాస్తు కేంద్రంతార్నాకహైదరాబాద్ఫోన్: 9440611151

 

17 అక్టోబరు 2020 శనివారం రోజున సూర్యుడు చిత్తా నక్షత్రం మూడవ పాదంభారత కాలమానం ప్రకారం ఉదయం 07.05 నిమిషాలకు తులారాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. సూర్యునకు తులారాశి శత్రు క్షేత్రం అవుతుందిసూర్యుడు తులా రాశిలో నవంబర్ 16 వరకు ఉంటాడు. తులారాశిలో సూర్యుడు సంచరించడాన్ని తులా సంక్రాంతి అని పిలుస్తారు.

 

సూర్యుడు తులా రాశిలో ఉండగా ఫలితం ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం ఎదురుకాబోతుందని అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా చంద్రుడుబుధుడు తిరోగమనం వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి. తులా రాశిలో సూర్యుడు స్థానచలనం వల్ల రాజకీయ నాయకులకుఅధికారులుపెద్ద పారిశ్రామిక వేత్తలకు నష్టం కలిగే అవకాశముంది. ఈ నెల రోజులలో రవి శుభ ఫలితాలను ఇవ్వలేదు. సూర్యుడు తులారాశిలో మార్పు చెందినప్పుడు ఆర్థిక మాంద్యంరాజకీయసామాజిక ఒడిదుడుకులు ఏర్పడతాయి.

 

వాతవారణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు బంగారానికి అధిదేవత కాబట్టి బంగారం ధరలు పెరుగునుధాన్యాల ధరలు పెరుగుతాయి. భారతదేశం మకరరాశికి చెందినది తులారాశిలో ఉన్న రవివలన భారతదేశానికి సంబంధించిన మకరరాశి చతుర్ధ దృష్టి వలన వేధా స్థానం అవుతుంది. రవి వేధన వలన రాబోయే నెల రోజుల్లో ఇండియా మరియు చైనా సరిహద్దులలో ఆవంచనీయ సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముంది.

 

ప్రపంచ దేశాలకు పెద్దన్నగా పిలువబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తులారాశిలో సూర్యుడు ఉన్న కారణం వలన ప్రతికూలంగా ఉంటుంది. ట్రంప్ రాశి అయిన సింహంలో శనిగురుడు కేంద్రీకృతమై ఉండటం వల్ల పదవీగండం ఉండే అవకాశముంది. ఈ ఫలితంగా ప్రపంచ మార్కెట్లపై ప్రభావముంటుంది.

 

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహ 'రాజు' అంటే గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. సూర్యుడు తన స్థానంలో మార్పు చేసుకుంటున్న ఫలితంగా ప్రజలపై ప్రభావం పడుతుంది. జ్యోతిషం ప్రకారం సూర్యుడు. ఏదైనా రాశిచక్రంలో మార్పు చెందినట్లయితే లేదా సంక్రాంతి చెందినట్లయితే ఆర్థిక మాంద్యంరాజకీయసామాజిక ఒడిదుడుకులువాతవారణంలో మార్పులు లాంటివి సంభవిస్తాయి. సూర్యుడు తుల రాశిలో మార్పు చెందినప్పుడు బంగారం మరియు ధాన్యాల ధరలు పెరుగుతుయి.

 

నాయకులకుఅధికారులకుపారిశ్రామిక వేత్తలకు ప్రముఖులకు అంత అనుకూలం కాదనే చెప్పాలినష్టం జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సూర్యుడు మరియు గురు గ్రహాలకు జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక స్థానముంది. వీటిని బంగారు కారకాలుగా పరిగణిస్తారు. తులా రాశిలో సూర్యుడి ప్రయాణం వలన బంగారం ధర పెరిగే అవకాశముంది. పెట్టుబడుదారులు స్టాక్ మార్కెట్ల నుంచి బంగారంలో మదుపు చేసేందుకు మక్కువ చూపిస్తారు.

 

తులారాశిలో సూర్యుడుమకరం పదో పాదంలో శని ప్రయాణిస్తుండటంమీనం ఎనిమిదో పాదంలో అంగారకుడు ఉండటం వల్ల రాబోయే నెల వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా చంద్రుడుబుధుడుపై శనిఅంగారకుడి చెడు దృశ్యం ఉండటం వల్ల గోధుమబియ్యంపప్పు ధాన్యాలు ధరలు కూడా పెరుగుతాయి.

 

​సూర్య సంక్రాంతి జాతకంలో మేషంలోని ఆరో పాదంలో అంగారకుడుమకర శని వలన మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. కుజుడు ఆరో స్థానం గమనిస్తే ఇది సరిహద్దులో యుద్ధాన్ని సూచిస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాశి అయిన వృశ్చికంలో సూర్యుచంద్రులు భ్రమిస్తున్నారు. ఫలితంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రధాని జాతకరీత్యా ఆయన రాశిలో 12వ పాదంలో సూర్యుడు కదలనున్నాడు. ఇండియా చైనా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులు. శనిఅంగారక గ్రహాలు కూడా ఉన్న నేపథ్యంలో యుద్ధాన్ని సూచిస్తుంది.

 

సూర్యుడు తానున్న రాశి నుండి 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలకు చెడు ఫలితాలు ఇస్తాడు. అంటే తులావృశ్చికమకరకుంభమేషవృషభమిధునకన్యా రాశుల / లగ్నాల వారు కొంత జాగ్రత్తలతో వ్యవహరించడం అవసరం. ఈ రాశులు లేదా లగ్నాల సంబంధితమైన రాజకీయసినిమాపారిశ్రామిక రంగాలలోని ప్రముఖులపై ప్రభావం ఎక్కువ చూపనున్నది. వ్యక్తిగత జాతక ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉంటాయి. సూర్య గ్రహం అనుకూలతల కొరకు ద్వాదశ రాశుల వారు సూర్య సహస్ర నామం లేదా సూర్యాష్టకం చదువుకోవాలి. జిల్లేడు ఆకులతో సూర్యున్ని పూజించాలి. ఆదివారం మఖకృత్తికస్వాతిరేవతిపుష్యమి నక్షత్రాలు కలిసిన ఆది 'భాను'వారం చేస్తే శ్రేష్టం.

సూర్యుడు తులారాశిలో ప్రవేశం, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *