Top Ad unit 728 × 90

జన్మ నక్షత్రాన్ని బట్టి  పూజించాల్సిన మరియు పెంచాల్సిన వృక్షాలు

జన్మ నక్షత్రాన్ని బట్టి  పూజించాల్సిన మరియు పెంచాల్సిన వృక్షాలు

 

డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

ఖగోళంలో ఎన్నో నక్షత్రాలు మనకు కనిపించినప్పటికీ భారతీయ జ్యోతిషశాస్త్ర ప్రకారం ప్రామాణీకమైనవి, తప:శక్తి సంపన్నులైన మన పూర్వీకులు వారి పరిశోధనలో ఒక నిర్ధిష్టమైన కక్ష్యలో బ్రమణం చేస్తూ భూ మండలం మీద నివసించే ప్రాణులకు ఉపయుక్తమైన వాటిని గణనలోకి తీసుకున్నవి 27 నక్షత్రాలు. వీటికి ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. మన జన్మ నక్షత్రాన్ని అనుసరంచి జ్యోతిషశాస్త్ర ఆధారంగా వాటికి సంబధించిన వృక్షాలు నిర్ణయింపబడి ఉన్నాయి. ప్రతి వ్యక్తి వారి వారి నక్షత్రాలకు అనుగుణంగా ఉన్న వృక్షలను పోషించి వాటికి తగు సేవలు చేస్తూ ప్రతి రోజు పూజించి వాటికి 11 ప్రదక్షిణలు చేసి, ఆ వృక్షం దగ్గర కొంత సేపు సమయం వెచ్చించి, వీలైతే ధ్యానం చేసుకుంటే మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఇదోక చక్కని తరుణోపాయం. మన నక్షత్రానికి సంబంధించి పెంచాల్సిన వృక్షాలు వాటి వలన మనకు కలిగే ఫలితాలు ఏమిటో గమనిద్దాం.

 

అశ్వని నక్షత్రం వారు: విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాలు మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

 

భరణి నక్షత్రం వారు: ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధితమైనవి, పైత్యము, పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది.

 

కృత్తిక నక్షత్రం వారు: అత్తి/మేడి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తిని పొందుతారు.

 

రోహిణి నక్షత్రం వారు: నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తనను పొందుతారు. వ్యవసాయానికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

 

మృగశిర నక్షత్రం వారు: మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

 

ఆరుద్ర నక్షత్రం వారు: చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

 

పునర్వసు నక్షత్రం వారు: వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని పెద్దలు చెబుతారు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

 

పుష్యమి నక్షత్రం వారు: రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రుణ, రోగ బాధల నుండి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులౌతారు.

 

ఆశ్లేష నక్షత్రం వారు: సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం, పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

 

మఖ నక్షత్రం వారు: మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి.

 

పుబ్బ నక్షత్రం వారు: మోదుగ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

 

ఉత్తర నక్షత్రం వారు: జువ్వి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

 

హస్త నక్షత్రం వారు: సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి. దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

 

చిత్త నక్షత్రం వారు: మారేడు లేదా తాళ చెట్టును పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

 

స్వాతి నక్షత్రం వారు: మద్ది చెట్టును పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచికి సంబంధించిన సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. పలు విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

 

విశాఖ నక్షత్రం వారు: వెలగ, మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

 

అనురాధ నక్షత్రం వారు: పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

 

జ్యేష్ఠ నక్షత్రం వారు: విష్టి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతంగా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

 

మూల నక్షత్రం వారు: వేగి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితంలో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.

 

పూర్వాషాడ నక్షత్రం వారు: నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు, వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.

 

ఉత్తరాషాడ నక్షత్రం వారు: పనస చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలున్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

 

శ్రవణం నక్షత్రం వారు: జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. ఆర్ధిక పరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

 

ధనిష్ఠ నక్షత్రం వారు: జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడుకి సంబంధించిన సమస్యలు రావు. వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

 

శతభిషం నక్షత్రం వారు: కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకి సంబంధిచిన, మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

 

పూర్వాభాద్ర నక్షత్రం వారు: మామిడి చెట్టుని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి. కళలు,సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

 

ఉత్తరాభాద్ర నక్షత్రం వారు: వేప చెట్టుని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వలన మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

 

రేవతి నక్షత్రం వారు: విప్ప చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ, గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

 

జన్మ నక్షత్రాన్ని బట్టి  పూజించాల్సిన మరియు పెంచాల్సిన వృక్షాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *