Top Ad unit 728 × 90

రూపాయి భారీ పతనానికి కారణాలేమిటీ…?

రూపాయి భారీ పతనానికి కారణాలేమిటీ…?

 

బీజేపీ పాలనలో దేనికి నియంత్రణ లేకుండా పోతోంది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. నిత్యావసరాలు మండిపోతున్నాయి. తాజాగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థనే కృంగదీస్తోంది. అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. ఈ పతనం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా డాలర్ కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ రూపాయి భారీగా క్షీణిస్తోంది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా రూ.75.50 మార్క్ కు చేరడం సంచలనమైంది.రూపాయి విలువ భారీగా పతనమైంది. సోమవారం మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి అత్యంత కనిష్టస్థాయిలకు దిగజారింది. ద్రోవ్యోల్బణం పెరుగుతుందనే భయాందోళనలతో గ్లోబల్ మార్కెట్లు భారీగా పతనమవుతుండడంతో రూపాయి కుప్పకూలింది.

సోమవారం ఉదయం ట్రేడింగ్ లోనే 77.41 స్థాయిలకు పడిపోయిన రూపాయి.. చివరకు కూడా 77.50 వద్ద క్లోజ్ అయ్యింది. చివరిసారి మార్చి 72022న రూపాయి వాల్యూ అత్యంత కనిష్టస్థాయి రూ.76.98ను తాకింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలవా…? అని ట్రేడర్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి.

ఇక కరోనాపై చైనీస్ నేతలు మళ్లీ హెచ్చరికలు చేయడం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా వడ్డీ రేట్లను పెంచుతూ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఇవన్నీ కలిసి రూపాయి విలువను దెబ్బతీశాయి.

 

ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో రూపాయి విలువ పతనమైంది. బ్యారల్ 113 డాలర్లపైనే ఈ ధరలు పలికాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిలు పెరుగుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు కూడా భారీగా అమ్మకాలకు ఎగబడడంతో కరెన్సీ విలువ దిగజారిపోతోంది. రష్యా ఉక్రెయిన్ల యుద్ధం జరిగేది ఈ రెండు దేశాల మధ్యే అయినా ఈ ప్రభావం మిగతా దేశాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే రష్యా ఆట కట్టించాలని యూరోపిన్ దేశాలు ఆ దేశంపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి.

 

దీంతో రష్యా నుంచి ఇతర దేశాలకు ఎలాంటి రవాణా లేకుండా పోయింది. ఫలితంగా రష్యా నుంచి అవసరముంటే వస్తువుల కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇక రష్యా ఉక్రెయిన్ల యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉంటూ వస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ కు దూరంగా ఉంది. అయినా భారత్ పై ఈ ప్రభావం బాగానే ఉంది. సోమవారం నాటి షేర్లు విపరీతంగా డౌన్ అయ్యాయి. అటు కమోడీటీస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా భారత రూపాయి కనిష్టంగా 77.50 అమెరికా డాలర్ కి చేరింది.

 

భారత్లో షేర్స్ డౌన్ తోనే ప్రారంభమయ్యాయి. అధిక ద్రవ్యోల్భణం చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ పడిపోయింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 1శాతం కోల్పోయి 77.50గా నమోదైంది. 'పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా అధిక వాణిజ్య లోటుల ఆందోళనతో భారత రూపాయి బలహీనపడిందని అదనంగా హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ రిటైల్ రీసెర్చ్ డిప్యూటీ హెడ్ దేవర్స్ వకీల్ ఈ సందర్భంగా అన్నారు. సెంటిమెంట్ పై దిగజారుతున్న ప్రమాదం పెద్ద ఐపీఓ ఫండ్ ను వాయిదా వేయడానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.

 

ఇక దేశీయంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి వేయడం కోసం వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ సడెన్ గా వడ్డీ రేట్లను పెంచడంతో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 3 బేసిస్ పాయింట్లు పెరిగి 7.484 శాతానికి చేరుకున్నాయి. అయితే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను పెంచుతుండడంతో దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఫండ్స్ తరలిపోతున్నాయి. దీంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుందని ఎడెల్విస్ వెల్త్ రీసెర్చ్ తన ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో పేర్కొంది.

 

స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులు తరలిపోవడం రూపాయి విలువపై ప్రభావం చూపుతుందన్నారు.

 

రూపాయి భారీ పతనానికి కారణాలేమిటీ…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *