Top Ad unit 728 × 90

మీ డబ్బులకు మీరే బాధ్యులు...!

మీ డబ్బులకు మీరే బాధ్యులు: ATMలో డబ్బులు డ్రా చేస్తున్నారా…?

 

బ్యాంకు అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేయాలంటే చాలు, దగ్గరలోని ఏటీఎంకు పరిగెత్తుతుంటారు. నగదు విత్ డ్రా చేయాలన్న తొందరలో తెలిసో తెలియకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఏటీఎంలో సీసీ కెమెరా ఉందిగా మోసగాళ్లు ఎలా మాయ చేస్తారులే అని భ్రమపడుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతో విలువైన నగదును కోల్పోతారు జాగ్రత్త అంటున్నారు నిపుణులు.

 

ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసే సమయంలోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి భారీ దోపిడీ ఒకటి బబయటపడింది.

 

మోసగాళ్ల టార్గెట్ వీరే:


పెద్దగా చదువుకోనివారినే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నట్టు తేలింది. సెక్యూరిటీ గార్డులేని ఏటీఎం సెంటర్లు, నాన్ ఫంక్షనల్ ఏటీఎం సెంటర్లనే నేరగాళ్లు ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారట. ఇలాంటి ఏటీఎం సెంటర్లలోకి నగదు కోసం వచ్చే అవగాహన లేనివారిపైనే వీరి గురి ఉంటుంది. వారికి సాయం చేస్తున్నట్టుగా నటిస్తూనే నమ్మించి అకౌంట్లలో నగదు కాజేస్తున్నారు.

 

ATM లోకి బాధితులు వెళ్లేంత వరకు మోసగాళ్లు ఎదురుచూస్తారు. వారు వెళ్లగానే వెంటనే లోపలికి వెళ్లి వెనుక నిలబడతారు. బాధితులు ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయడం చూసి సీక్రెట్ గా నోట్ చేసుకుంటారు. ఒకవేళ నగదు విత్ డ్రా చేసే వ్యక్తి ట్రాన్స్ జెక్షన్ విఫలమైతే చాలు, వెంటనే సాయం చేస్తున్నట్టుగా నటిస్తారు. బాధితుల నుంచి ఏటీఎం కార్డును తీసుకుని వారిని మాటల్లో పెడతారు.

 

మోసపోయేది ఇక్కడే:


తెలివిగా ఒరిజినల్ ఏటీఎం కార్డు స్థానంలో క్లోనింగ్ (ఫేక్) ఏటీఎం కార్డును మార్చేస్తారు. మీ అకౌంట్ ట్రాన్స్ జెక్షన్ కావడం లేదని, మరో ఏటీఎంకు వెళ్లి ట్రై చేయమని మెల్లగా చెబుతారు. కార్దుదారులు అది నమ్మి అక్కడి నుంచి వెళ్లిపోగానే అసలైన ఏటీఎం కార్డుతో నగదు విత్ డ్రా చేసి అక్కడి నుంచి ఊడాయిస్తారు. అందుకే, ఏటీఎం కార్డును ఎప్పుడూ కూడా అపరిచితులకు ఇవ్వకూడదు. ఏటీఎం పిన్ ఎంటర్ చేసే సమయంలో ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

 

గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే:


1. ఏటీఎం PIN ఎప్పుడూ గుర్తించుకోవాలి. కార్డులపై సహా ఎక్కడా పిన్ నెంబర్ రాయడం చేయకూడదు.


2. ఏటీఎం కార్డు నెంబర్, పిన్ నెంబర్, CVV నెంబర్లను బ్యాంకు అధికారులు సహా ఎవరికి ఇవ్వకూడదు.


3. మోసాల బారిన పడకుండా ఉండాలంటే, తరచుగా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మారుస్తుండాలి.


4. కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే, గుర్తుండేలా పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి.


5. పుట్టిన తేదీ, వాహనం నెంబర్, ఫోన్ నెంబర్లను ఏటీఎం పిన్ నెంబర్ గా ఎప్పుడూ పెట్టుకోవద్దు.


6. ATMలో నగదు డ్రా చేస్తే, ఏటీఎం లేదా POS మిషన్ లో స్వైప్ చేస్తే దగ్గరగా నిలబడాలి.


7. పిన్ నెంబర్ ఎంటర్ చేసే కీ ప్యాడ్ పై మరో చేతిని అడ్డంగా పెట్టి పిన్ ఎంటర్ చేయాలి.


8. మీరు నగదు విత్ డ్రా చేసే సమయంలో మీ పక్కన ఇతరులు లేకుండా చూసుకోవాలి.


9. ATM లో డబ్బులు డ్రా చేసేటప్పుడు కొత్తవారితో మాట్లాడొద్దు. ఎవరికి మీ కార్డును ఇవ్వరాదు.


10. ATMకు ఏదైనా డివైజ్ కనెక్ట్ అయి ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ట్రాన్స్ జెక్షన్ ఆపేయండి.


11. ఏటీఎం గార్డు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం అందించండి.


12. నగదు విత్ డ్రా పూర్తి కాగానే, Cancel బటన్ నొక్కడం మరవద్దు.


13. ATMలో Welcome Screen వచ్చే వరకు ఏటీఎం సెంటర్ వదిలివెళ్లొద్దు.


14. ATM కార్డు కోల్పోయినా లేదా ఎవరైనా దొంగలించినా, సదరు బ్యాంకుకు వెంటనే రిపోర్ట్ చేయాలి.


15. అకౌంట్ బ్రాంచ్ కు లేదా ఆ బ్యాంకు కస్టమర్ కేర్ కు కాల్ చేసి కార్డు బ్లాక్ చేయమని చెప్పండి.


16. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు వాడుతున్నట్టుయితే మోసపూరిత ట్రాన్స్ జెక్షన్ కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మీ ఏటీఎం కార్డును మీరే బ్లాక్ చేసుకోవచ్చు.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ డబ్బులకు మీరే బాధ్యులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *