Top Ad unit 728 × 90

11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ!

11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ! రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్

 

-పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్

-ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ

 

హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది.

 

11 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కారు రెడీ అయింది. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయనున్నది.

 

గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్ లో 5089 పోస్టులతో బీఆర్ఎస్ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,77,502 మంది అప్లై చేసుకున్నారు. కాగా, నవంబర్ 20 నుంచి 30 వరకూ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించినా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే, చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే పోస్టులుండటంతో పాటు, చాలా జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు లేకపోవడంపై నిరుద్యోగుల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురైంది.

 

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా డీఈవోల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను సేకరించారు. దీనికి అనుగుణంగా సుమారు 10 వేల వరకూ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.

 

దీనికి అనుగుణంగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను రిక్రూట్ చేయనున్నారు. వీరు 1523 పోస్టుల భర్తీకి గత సర్కారు ఆమోదం తెలిపింది. కానీ, స్టేట్ లో సుమారు వెయ్యి వరకూ పోస్టులు అవసరం ఉంటాయనే అంచనా వేస్తున్నారు.

 

అయితే, గతంలో 5089 పోస్టులతో రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. అయితే, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉండటంతో, రెండు మూడు రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది.

 

11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *