Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఏకంగా ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ నే ఓపెన్ చేసిన కేటుగాళ్లు…!

ఏకంగా ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ నే ఓపెన్ చేసిన కేటుగాళ్లు…!

 

బ్యాంకులకు కన్నాలు వేసే దొంగల గురించి తెలుసు. పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారీ అయ్యే ప్రబుద్ధుల గురించి తెలుసు. రొటీన్‌గా మోసాలు చేస్తే కిక్‌ ఏముంటుది అనుకున్నారో ఏమో, ముగ్గురు వ్యక్తులు ఏకంగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్‌రూటి తాలుకాలో చోటు చేసుకుంది. మూడు నెలల పాటు సాఫీగా సాగిన ఈ నకిలీ బ్రాంచు వ్యవహారం చివరికి ఓ ఎస్‌బీఐ కస్టమర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురిలో ప్రధాన సూత్రధారి కమల్‌బాబు. తల్లి బ్యాంకు మాజీ ఉద్యోగి. ఓ పేరుమోసిన బ్యాంకులో పనిచేసి రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. మరో వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి రబ్బర్‌ స్టాంప్‌లను తయారీ చేస్తున్నారు.

 

ఎస్‌బీఐ కస్టమర్‌ ఒకరికి ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చి స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. సదరు మేనేజర్‌ ఈ సమాచారాన్ని జోనల్‌ ఆఫీసుకు తెలియజేశారు. ఎస్‌బీఐకు సంబంధించి పన్‌రూటీలో కేవలం 2బ్రాంచులకు మాత్రమే అనుమతులున్నాయని మూడోది బ్రాంచ్‌ నకిలీదని జోనల్‌ అధికారులు నిర్ధారించారు. నకిలీ బ్రాంచును సందర్శంచి అందులో సోదాలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఈ బ్రాంచు నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రూపకల్పన చూసి అధికారులు విస్తుపోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

సమాచారం అందుకున్న పన్‌రూటీ పోలీసులు ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్‌ తెలిపారు.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఏకంగా ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ నే ఓపెన్ చేసిన కేటుగాళ్లు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *