Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు బుధవారం 21 ఫిబ్రవరి  2024

ఈ రోజు మీ రాశి ఫలాలు బుధవారం 21 ఫిబ్రవరి  2024

 

డా.యం.ఎన్.చార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు  మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు  నిరుద్యోగుల  కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున హోదాలు  పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు చేపట్టిన పనులలో జాప్యం  కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి  ధన సహాయం లభిస్తుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబమున  అనిశ్చిత కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం  కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోగస్థులకు ఊహించని స్థాన చలనాలుంటాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.  వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంభందిత  వివాదాలలో విజయం సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో  దీర్ఘకాలిక వివాదాలను రాజి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు బుధవారం 21 ఫిబ్రవరి  2024 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *