Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 07 జూన్ 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 07 జూన్ 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు.  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి.  నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక  నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం  ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి,  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో  అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 07 జూన్ 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *