Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 21 జూన్ 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 21 జూన్ 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.  వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలకసమయంలో సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యను పనికి సన్నిహితుల నుండి నిందలు  ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 21 జూన్ 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *