Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 05 జులై 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 05 జులై 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక –హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత  నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 05 జులై 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *