Top Ad unit 728 × 90

ఆస్తి వివాదంపై ఇద్దరు మహిళల మధ్య గొడవ...!

ఆస్తి వివాదంపై ఇద్దరు మహిళల మధ్య గొడవ... కొట్టుకుంటూ మురికి కాలువలో పడ్డారు!

 

ఇటీవలి కాలంలో ఆస్తి తగాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవ పెద్దదిగా మారి ఏకంగా హత్యలు చేసుకునే వరకు వెళుతుంది.

 

అలానే అక్కాచెల్లెళ్ల మధ్య కూడా ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. మహిళలు ఆస్తి విషయంలో గొడవపడి రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఎలాంటి ఘటనే రాజస్థాన్లోని అజ్మీర్లో చోటుచేసుకుంది.

 

రాజస్థాన్లోని బీవార్నగరంలోని తత్గఢ్రోడ్డులో ఉన్న నైరా పెట్రోల్పంప్సమీపంలో ఆస్తి వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇరువర్గాల మహిళలు దారుణంగా తిట్టుకుంటూ కొట్టుకునే పరిస్థితికి చేరారు. ఇద్దరు మహిళలు గొడవ పడుతూ... డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీలో పడినా ఆ మహిళలు మాత్రం కొట్టుకోవడం ఆపలేదు. ఒకతను కాలువలో దిగి ఒక స్త్రీని కొడుతుండగా... మరో వ్యక్తి కూడా ఆమెను పట్టుకోవడానికి కాలువలో దిగుతాడు. అంతలో మరో వ్యక్తి వచ్చిడ్రైనేజీపై నుంచి అతనిపై తంతాడు. ఇలా ఇరు వర్గాలు గొడవపడ్డాయి.

 

ఇరు వర్గాలు కొట్లాడుకుంటుంటే, ఆ పోరాటాన్ని చూసేందుకు భారీ ఎత్తున జనం కూడా గుమిగూడారు. వారిని విడిపించడానికి ఎవరూ ప్రయతించలేదు. ఈ ఘటన మొత్తం రోడ్డుపై ఉన్న సీసీటీవీలో రికార్డయింది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఈ ఆస్తి తగాదాకు సంబంధించిన వీడియోను సిటీ ఎస్హెచ్వో సురేంద్ర సింగ్ జోధా పరిశీలించారు. అనంతరం సురేంద్ర సింగ్ మాట్లాడుతూ... ఆస్తి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోందన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఇద్దరు మహిళల మధ్య గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఆస్తి వివాదంపై ఇద్దరు మహిళల మధ్య గొడవ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *