ఫుల్లుగా మద్యం తాగి పోలీస్‌ని తన్నబోయిన యువతి...!
ఫుల్లుగా మద్యం తాగి పోలీస్‌ని తన్నబోయిన యువతి... వీడియో చూస్తే షాకే!
ఈ రోజుల్లో ఆడ, మగ భేదం లేకుండా పూటుగా చాలామంది మద్యం తాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరకు అమ్మాయిలు మద్యం సేవించినట్లు బహిరంగంగా ఎవరికీ తెలియకపోయేది.
కానీ ఇప్పుడు భారతదేశంలో ఆ చిత్రం మారిపోయింది. మగవారిలాగా అమ్మాయిలు కూడా తాగి నానా రచ్చ సృష్టిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మరొక సంఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. వివరాలలోకి వెళ్తే... ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో రాత్రి పూట పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఒక యువతి కనిపించింది. ఆమె తన కారుని ఒక బిజీ రోడ్లో ఆపి వచ్చిపోయే వారిపై దుర్భాషలాడుతూ ఉంది. మైకంలో తానేం చేస్తున్నానో కూడా తెలియకుండా ఆమె ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ అందరిపైకి ఎగిరిపడింది. ఈ దృశ్యాన్ని చూసి షాకైన పోలీసులు వెంటనే ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని, ఇంటికి వెళ్ళిపోమ్మని నచ్చ చెప్పినా ఆమె వినలేదు. ఆమె ఒక పోలీస్ అధికారి జట్టు పట్టుకొని చాలా దారుణంగా ప్రవర్తించింది. అంతేకాదు అతడి మాస్క్ తీసుకుని కింద పడేసింది. అనంతరం కాలెత్తి అతన్ని తన్నపోయింది. అయితే పోలీసు కాస్త పక్కకు జరిగి తప్పించుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు యువతిపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. అమ్మాయి కాబట్టి పోలీస్ ఏం అనలేదు లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోని ఒక జర్నలిస్ట్ షేర్ చేయగా ఇప్పటికే దీనికి 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
एक और परी की Video Viral है।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 19, 2022
देखिए कैसे एक पुलिस अधिकारी की वर्दी का कॉलर पकड़ कर खड़ी है और पुलिस वाला बेबस है।
क्योंकि जानता है गलती से अगर उसने लड़की को ही हाथ लगा दिया तो क़ानून उसको ही नाप देगा। pic.twitter.com/5AHtj3E2A7
