Top Ad unit 728 × 90

వారఫలితాలు తేదీ 18 నవంబర్ శుక్రవారం నుండి 24 గురువారం 2022 వరకు    

వారఫలితాలు తేదీ 18 నవంబర్ శుక్రవారం నుండి 24 గురువారం 2022 వరకు      

 

డా.యం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక:  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం.ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. కళారంగం వారి ఆశలు కాస్త నిరాశ పరుస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి, ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ వారం కొన్ని పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరట నిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కొత్త  బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం శ్రమకోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పు, ఓర్పుతో పరిష్కరించు కుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో పరిస్థితులు అనుకూలించవు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం ఇంటా బయటా మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగాలలో  కొత్త విధులు చేపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో  ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:  ఈ వారం ఉద్యోగార్ధుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణయత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  ఖర్చులు అధికం. బంధు విరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం. కళారంగం వారికి ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో  ఖర్చులు. కొన్ని అంచనాలు తప్పుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంట నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో కొన్ని సమస్యలు.  గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. వ్యాపారాలలో  ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొంత ఊరట లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి. ఆరోగ్య పరంగా కొంత చికాకు ఎదురు కావచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ వారం ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పర్చినా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటి నిర్మాణాలు కాస్త నిదానిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి కార్యద్ధి. వారం  ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. ఇంట్లో వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. వారం  ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వారఫలితాలు తేదీ 18 నవంబర్ శుక్రవారం నుండి 24 గురువారం 2022 వరకు     Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *