Top Ad unit 728 × 90

వారఫలితాలు తేదీ 29 మార్చి 2024 శుక్రవారం నుండి ఏప్రిల్ 4 గురువారం వరకు           

వారఫలితాలు తేదీ 29 మార్చి 2024 శుక్రవారం నుండి ఏప్రిల్ 4 గురువారం వరకు           

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అన్నిరంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి:  ఈ వారం చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంటాబయట మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషానిస్తుంది. విద్యార్థుల ఆశించిన అవకాశములు అందుతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుం. వారం ప్రారంభంలో ఋణఒత్తిడులు అధికమౌతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం వారం ప్రారంభంలో ఆకస్మిక ధనప్రాప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మందకోడీగా సాగుతాయి. మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయట సమస్యలు అధిగమవుతాయి. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ వారం స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు పడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహారించాలి. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబంలో గంధరగోళ పరిస్థితులుంటాయి. మానసిక చికాకులు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీత భత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ వారం కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం మిత్రులతో ఆకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమౌతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందుకు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వారఫలితాలు తేదీ 29 మార్చి 2024 శుక్రవారం నుండి ఏప్రిల్ 4 గురువారం వరకు            Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *