Top Ad unit 728 × 90

వారఫలితాలు తేదీ 07 జూన్ 2024 శుక్రవారం నుండి 13 గురువారం వరకు

వారఫలితాలు తేదీ 07 జూన్ 2024 శుక్రవారం నుండి 13 గురువారం వరకు

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వివరాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులు సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరి ఊరట పొందుతారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ఋణ భారం పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం చాలా కాలంగా పూర్తి కాని పనులలో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై స్నేహితులతో చర్చలు చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ వారం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు. విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగుపడతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. బంధు వర్గం నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల స్థాన చలనాల ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నతరహా పరిశ్రమల అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. పనులు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంభ సభ్యులకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని రంగాల వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. సంతాన వివాహాది వేడుకలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో పూర్వవైభవం కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి ఒత్తిడులు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు ఉన్నవి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక విషయాలలో అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు. వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగములో తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘ కాలిక సమస్యల నుంచి బయటపడతారు. అన్ని రంగాల వారికి చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. పనుల్లో శ్రమ తప్పదు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులను సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం చివరలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వారఫలితాలు తేదీ 07 జూన్ 2024 శుక్రవారం నుండి 13 గురువారం వరకు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *