Top Ad unit 728 × 90

వారఫలితాలు తేదీ 05 జూలై 2024 శుక్రవారం నుండి 11 గురువారం వరకు          

వారఫలితాలు తేదీ 05 జూలై 2024 శుక్రవారం నుండి 11 గురువారం వరకు          

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంత బంధువుల నుండి అందిన ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వారం ప్రారంభమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వారాంతమున ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు లాభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం ఇంట బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమున మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారాంతమున సోదరులతో అనుకోని విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్ధిక లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి పుంజుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరన ధనవ్యయ సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో కుటుంబ సభ్యులతో మీ మాటతో విభేదిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం అవసరానికి చేతిలో ధనం నిల్వ లేక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారాలలో లోటుపాట్లు సరిద్దిదుకుంటారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలకు దిగడం మంచిది కాదు. వారాంతమున ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన వ్యాపారస్తుల ఆశించిన లాభాలు అందుతాయి. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. వారాంతమున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాల కలిగిస్తాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులలో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మెరుగైనవాతావరణం ఉంటుంది. రియల్ఎస్టేట్ వ్యాపారులకు నూతన లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు. వారం ప్రారంభంలో ధన పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వారఫలితాలు తేదీ 05 జూలై 2024 శుక్రవారం నుండి 11 గురువారం వరకు           Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *