Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

వారఫలితాలు: తేదీ 25 సెప్టెంబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 1 గురువారం 2020 వరకు

వారఫలితాలు: తేదీ 25 సెప్టెంబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 1 గురువారం 2020 వరకు

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషరాశి (Aries): వారం ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం సూచనలు ఉన్నాయి. ఇంతకాలం పడిన అవస్థలు, ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. మీ ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. నూతన ఉద్యోగయోగం గోచరిస్తుంది. ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు నెమ్మదిగా పుంజుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus): వారం వ్యాపారాలు విస్తరించేందుకు ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరంటే మిత్రులు మరింత ఇష్టపడతారు. భూముల రిజిస్ట్రేషన్లు వంటివి పూర్తి చేస్తారు. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరచినా అవసరాలకు లోటు ఉండదు. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు ఉండే సూచనలున్నాయి, మాట అదుపులో పెట్టుకోవడం ఉత్తమం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini): వారం స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కే అవకాశం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు, సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చును. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీ అభివృద్ధిలో సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer): వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి ఒడిదుడుకులు కొంత తొలగుతాయి. ఆశించిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఊహించని రీతిలో ఒక వ్యక్తి ద్వారా ధనలాభం కలిగే సూచనలు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం.వారం మధ్యలో అనారోగ్యం సూచనలున్నాయి జాగ్రత్తలు వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo): వారం ఉద్యోగాలలో కష్టసాధ్యమనుకున్న విధుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అన్ని పరిస్థితులు నిధానంగా చక్కబడతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. ఎదుటవారి సమస్యలు సైతం తీరే మార్గం సూచిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పని అధికంగా ఉండడం వలన మానసిక శ్రమ ఒత్తిడి వలన ఆరోగ్యభంగ సూచనలున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo): వారం ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఖర్చులకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. చేపట్టిన కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక డీలాపడతారు. ప్రయాణాలలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి, కొంత వెనుకబాటు కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra): వారం కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించే అవకాశం గోచరిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి.రాజకీయవర్గాల వారికి ఊహించని పిలుపు రావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio): వారం మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius): వారం నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మరింత ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. బంధువుల ద్వారా కొంత ధనలాభ సూచనలు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn): వారం ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం కనబడుతుంది. పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. శుభవార్తలు వింటారు. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుని అవసరాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేసె అవకాశాలున్నాయి. కొన్ని వ్యవహారాలకు మధ్యవర్తిత్వం వహిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు, లాభాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి ( Aquarius): వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేసెందుకు అనుకూలంగా ఉంది. సంఘంలో విశేష కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఆశించినంత రాబడి దక్కి అవసరాలు తీరతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని ఆత్మవిశ్వాసమే మీకు ఉపకరిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నూతన పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదా సూచనలు జాగ్రత్త. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces): వారం మీ అంచనాలు నిజం చేసుకుంటారు. మీపై వ్యతిరేకత చూపే వారు కూడా స్నేహ హస్తం అందించడం విశేషం భావించాలి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ముఖ్యమైన పనులు ప్రారంభంలో నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు. వివాహప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత ఊరట చెందే అవకాశాలున్నాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల వాతావరణం నెలకొంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

వారఫలితాలు: తేదీ 25 సెప్టెంబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 1 గురువారం 2020 వరకు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *