Top Ad unit 728 × 90

నేటి నుంచి మహిళల ఆసియా కప్...!

నేటి నుంచి మహిళల ఆసియా కప్...!

 

ఆసియా కప్‌ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు. శనివారం నుంచి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ ఆడనుంది. శనివారం జరుగనున్న తొలి పోరులో శ్రీలంకతో టీమ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో మన అమ్మాయిలు నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నా.. ఆసియా వరకైతే హర్మన్‌ప్రీత్‌ బృందం ఫేవరెట్‌ అనే చెప్పొచ్చు. 2004 నుంచి 2018 వరకు ఏడుసార్లు మహిళల ఆసియా కప్‌ జరగగా.. అందులో ఆరుసార్లు భారత్‌ విజయం సాధించడం విశేషం. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు టీ20 ఫార్మాట్‌లో రెండు సార్లు టైటిల్‌ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం బంగ్లాదేశ్‌పై ఓటమి పాలైంది.

 

నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. శనివారమే ఈ టీ20 టోర్నీకి తెరలేవనుంది. ఏడు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఆతిథ్య బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ పోరుతో మొదలవనుంది. 2020లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా పడి, ఆ తర్వాత రద్దయింది. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో విజయం సాధించేందుకు పలు దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఆఖరి వన్డేలో 'మన్కడింగ్‌'తో వార్తల్లోకెక్కిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. అవన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టిపెట్టేందుకు సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి.

 

నేటి నుంచి మహిళల ఆసియా కప్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *