Top Ad unit 728 × 90

ప్రపంచ రికార్డ్: పావురం ధర 14 కోట్లు...!

పావురాలతో పోటీలు నిర్వహిస్తూ ఉంటారని చాలా మందికి తెలుసు. ఇలా పావురాలకు రేస్ లను పెట్టి పెద్ద మొత్తంలో సంపాదించేవారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం పావురాలకు మంచి ఫుడ్, మంచి సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. ఇలాంటి పోటీల కోసమే కొందరు పావురాలను పెంచుతూ ఉంటారు. భారతదేశంలో కూడా కొందరు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి పావురాలను కొంటూ ఉంటారు. కానీ పావురాన్ని ఏకంగా 14 కోట్ల రూపాయలకు కొన్నాడు వ్యక్తి. పావురానికి 14 కోట్లు ఏంటని మీరు షాక్ అవుతూ ఉన్నారా..? స్టోరీని చావడండీ. 14 కోట్ల రూపాయల ఖరీదైన పావురం పేరు 'న్యూ కిమ్'. 'పిజన్ ప్యారడైజ్' ఆన్లైన్లో నిర్వహించిన వేలంలో ఇది రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు అమ్ముడుపోయింది. పావురాల పోటీలో పేరొందిన న్యూకిమ్ను చైనాకు చెందిన వ్యక్తి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. 'న్యూ కిమ్'గా పిలిచే ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ.1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి దానిని కొనుక్కున్నాడు. పావురం ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు.

గత ఏడాది మగ కపోతం 'అర్మాండో' 1.25 మిలియన్ యూరోలకు అమ్ముడుపోగా... ఇప్పుడా రికార్డును 'న్యూ కిమ్' బద్దలుగొట్టిందని పిపా తెలిపింది. 'న్యూ కిమ్' 2018లో జరిగిన 'ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్' పోటీల్లో విజేతగా నిలవడంతో పలువురు పోటీ దారులు దీన్ని కొనుక్కోడానికి పోటీ పడ్డారు. రెండేళ్ల వయసున్న 'న్యూ కిమ్'ను 200 యూరోల బేస్ ప్రైస్తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయింది. తనకు తెలిసినంత వరకు ఇది ప్రపంచ రికార్డు అని, ఇంత ధరకు పావురం అమ్ముడైన దాఖలాలు లేవని పిజన్ ప్యారడైజ్ చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ అన్నారు.

 

Tags: pslvtv,pigeon,world,record,new kim,race,breaking news

ప్రపంచ రికార్డ్: పావురం ధర 14 కోట్లు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *