Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

చైనాలో కొత్త వైరస్…!

చైనాలో కొత్త వైరస్…!


చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. ఇంకా కోవిడ్-19 విపత్తునుంచి బయట పడక ముందే, చైనా అధికారులు మరో కొత్త వైరస్ను గుర్తించినట్లు ప్రకటించారు. చైనాలోని మంగోలియా ప్రాంతంలో బుబోనిక్ ప్లేగు వ్యాధి వెలుగులోకి వచ్చిందని స్థానిక అధికారులు హెచ్చరించారు. 19 శతాబ్దంలో వచ్చిన ప్లేగ్ వ్యాధి కంటే ఇది చాలా భయంకరమైందని మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

 

తూర్పు చైనా ప్రాంతంలోని మంగోలియా పరిధిలో అనుమానిత బుబోనిక్ ప్లేగు (బ్లాక్ డెత్) కేసు గుర్తించినట్లు స్థానిక హెల్త్ కమిషన్ వెబ్ సైట్ పేర్కొంది. మంగోలియా ప్రాంతంలోని బయాన్ నూర్ నగరంలో తొలి కేసు గుర్తించినట్లు చెబుతున్నారు. ప్లేగు వైరస్ను సంక్రమింపజేసే పందికొక్కు మాంసం తినడం వల్ల 27 ఏళ్ల బాధితుడికి వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. దీంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేట్ చేశారు.

 

బుబోనిక్ ప్లేగును బ్లాక్ డెత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. 14 శతాబ్దంలో మధ్య ఆసియాలో తొలి సారిగి ప్లేగు వ్యాపించింది. దీని కారణంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ప్లేగు బుబోనిక్ వైరస్ కలిగిన కీటకాలు కుట్టడం ద్వారా వస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ కలిగిన ఎలుకలు కరిచినా బుబోనిక్ ప్లేగు సంక్రమించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 

బుబోనిక్ ప్లేగు వైరస్ ప్రవేశించిన ప్రాంతంలో చర్మం వాయడం, నొప్పితో పాటు చీము కూడా పడుతుంది. తర్వాత అదే ప్లేగులా మారుతుంది. ప్రస్తుతానికి మనిషి నుంచి మనిషికి వ్యాధి సంక్రమించినట్లు గుర్తించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాధి సంక్రమించకుండా ఉండాలంటే.. చనిపోయిన జంతు కళేబరాలను ముట్టుకోవద్దని, అంతే కాకుండా కీటకాలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

 

బుబోనిక్ ప్లేగు వస్తే తలనొప్పి, జలుబు, జ్వరం, ఆందోళన, కుట్టిన ప్రదేశంలో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ ప్రవేశించి ప్లేగుగా మారడానికి 2 నుంచి 6 రోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బుబోనిక్ ప్లేగు సంబంధించిన బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే న్యుమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేగు బారిన పడిన వారిలో 30 నుంచి 60 శాతం మందిలో మరణం సంభవించే అవకాశం ఉంది.

 

బుబోనిక్ ప్లేగు సంభవించకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1994లో మొజాంబిక్ దేశంలో బుబోనిక్ ప్లేగును గుర్తించారు. ఏడాది అగస్టు నుంచి అక్టోబర్ మధ్య అక్కడ బుబోనిక్ ప్లేగు విజృంభించి 216 మందికి సోకగా ముగ్గురు మరణించారు. 1978లో కెన్యాలో మహిళలు, పిల్లలకు వ్యాధి సోకింది. 393 కేసులు నమోదవగా 10 మంది చనిపోయారు. 1984లో లిబియాలో కూడా రకమైన ప్లేగు వ్యాపించింది.

 

2010 నుంచి 2015 వరకు ప్రపంచ వ్యాప్తంగా 3248 బుబోనిక్ ప్లేగు కేసులు నమోదవగా, 584 మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చైనాలో కొత్త వైరస్…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *