Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

పారిస్‌వాసులను భయపెట్టిన భారీ శబ్ధం...!

పారిస్వాసులను భయపెట్టిన భారీ శబ్ధం...!

 

పారిస్లో భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి. పేలుడు శబ్దాలు పారిస్ అంతటా వినిపించాయి. పేలుడు శబ్దాల కారణంగా పారిస్ అంతటా భయాందోళన వాతావరణం నెలకొన్నది. జెట్ఫైటర్ల నుంచే శబ్ధాలు వచ్చాయని కొందరు చెప్తుండగా బాంబు దాడి జరిగినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం బాంబు దాడి జరుగలేదని స్పష్టంచేస్తున్నారు. మిలజరీ జెట్నుంచి వచ్చిన సోనిక్బూమ్కారణంగా అలాంటి శబ్ధం వినిపించిందని ఫ్రెంచ్పోలీసులు ధ్రువీకరించారు. ఏమి జరిగిందో, ఏమి పేలిందో తెలుసుకోవడానికి స్థానికులు ఉత్సాహం చూపుతున్నారు. భారీ శబ్దం పారిస్ నివాసితులను భయభ్రాంతులకు గురిచేసింది. ఫ్రెంచ్ రాజధానిలో నెటిజన్లను సోషల్ మీడియా వార్తలు గందరగోళంలోనికి నెట్టాయి. పారిస్ ప్రాంతంలో చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఇది పేలుడు కాదు. ఇది సౌండ్ అడ్డంకిని దాటిన ఫైటర్ జెట్ అని పారిస్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అత్యవసర ఫోన్ లైన్లకు కాల్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. భారీ శబ్దం రావడంతో భవనాలు కదిలాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పలు వార్తలు వచ్చాయి. నగరంలో ఎటువంటి పొగ లేదా మంటలు కనిపించినట్లు కూడా దాఖలాలు లేవు. పారిస్లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆటగాళ్లను పేలుడు శబ్ధం కొన్ని నిమిషాలపాటు ఆడకుండా నిలిపివేసింది.

పారిస్‌వాసులను భయపెట్టిన భారీ శబ్ధం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *