Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్‌ ఎడిషన్‌న భారత్‌లో విడుదల…!

బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్‌ ఎడిషన్‌న భారత్‌లో విడుదల…!

 

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్‌ ఎడిషన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.55.40 లక్షల వద్ద ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ప్లాంట్‌ వద్ద తయారు చేశారు. దీనిలో బీఎస్‌ 6 ఇంజిన్‌ అమర్చారు. ఇప్పటికే కంపెనీ 530ఐఎం స్పోర్ట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన వాహనం రెండో మోడల్‌ కావడం విశేషం. 5 సిరీస్‌ వాహనాల ధర రూ.59.40 లక్షల వద్ద ఉంటుంది.

 

కొత్త కారులో సరికొత్త సాంకేతికతను బీఎండబ్ల్యూ అందిస్తోంది. డ్రైవర్లకు ఎల్లవేళలా కారుపై నిఘా ఉంచే ఫీచర్‌ను అందించారు. దీనిలో డ్రైవింగ్‌ కంట్రోల్‌ కదలికలకు సంబంధించిన ఫీచర్లను కూడా అందించనున్నారు. పార్కింగ్‌ అసిస్టెంట్‌, రియర్‌ వ్యూ కెమెరా, పార్క్‌ డిస్టెన్స్‌ కంట్రోల్‌ వంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి.

 

స్టాండర్డ్‌ వేరియంట్‌తో పోలిస్తే ఈ సరికొత్త వేరియంట్‌కు క్రోమ్‌, హైగ్లోస్‌ బ్లాక్‌తో అదనపు హంగులను సమకూర్చారు. భారీ కిడ్ని గ్రిల్‌తో విలాసవంతంగా కనిపిస్తుంది. ఈ కారుకు 17 అంగుళాల తేలికపాటి అలాయ్‌ వీల్స్‌ను అమర్చారు. 2లీటర్‌ 4సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 248 బీహెచ్‌పీ శక్తిని 350ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.1క్షణల్లోనే అందుకుంటుంది. దీనికి 8స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు. ఈ కారులో డ్రైవర్లు వివిధ డ్రైవింగ్‌ మోడ్‌లను ఎంచుకొనే అవకాశం ఉంది. కంఫర్ట్‌, స్పోర్ట్‌, ఈకో ప్రో, స్పోర్ట్‌ప్లస్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి.

 

యాంటీరోల్‌ కంట్రోల్‌ను అందించే డబుల్‌ విష్‌బోన్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌ సదుపాయం ఈ కారులో ఉంది. ఇక రక్షణ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, బ్రేక్‌ అసిస్టెంట్‌, యాక్టీవ్‌ పీడీసీ, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, కార్నరింగ్‌ బ్రేకింగ్ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌, సైడ్‌ ఇంపాక్ట్‌ ప్రొటెక్షన్‌, రన్‌ఫ్లాట్‌ టైర్స్‌ వంటి అద్భుతమైన ఫీచర్లను బీఎండబ్ల్యూ ఈ కారులో వినియోగదారులకు అందిస్తోంది.

 

బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్‌ ఎడిషన్‌న భారత్‌లో విడుదల…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *